హమ్మయ్య అమరావతి నిర్మాణాలు మొదలవుతున్నాయ్‌

అమరావతి రాజధానిలో అత్యద్భుత నిర్మాణాలు, ఆకాశాన్నంటే భవనాలూ.. ఇవన్నీ తరువాత.. ముందస్తుగా.. చంద్రబాబునాయుడు చెబుతున్నట్లుగా ఈ ఏడాది అసలక్కడినుంచి పరిపాలన పూర్తిస్థాయిలో మొదలవుతుందా లేదా? సెక్రటేరియేట్‌ ఉద్యోగులందరినీ జూన్‌కెల్లా కచ్చితంగా అమరావతి వచ్చేయాలని పురమాయించేడం బాగానే ఉంది. ఈలోగా అక్కడ ఆఫీసులు గట్రా ఎక్కడ దొరుకుతాయి చెప్మా? ఎలా సాధ్యమవుతుంది? అనే రకరకాల సందేహాలు ఇన్నాళ్లూ ప్రజల మెదళ్లలో మెదలుతూ ఉన్నాయి. కానీ ఆ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ.. అమరావతిలో సెక్రటేరియేట్‌కు సంబంధించి తాత్కాలిక భవన నిర్మాణాలకు టెండర్లను ప్రభుత్వం ఖరారుచేసింది. సింపుల్‌గా చెప్పాలంటే.. అమరావతిలో శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నాయి.. అసలంటూ చెప్పుకోడానికి ఒక నిర్మాణామైనా ఎప్పటికి మొదలవుతుందిరా బాబూ.. అనుకుంటున్న వారికి ఇది జవాబు! అమరావతి నగర నిర్మాణం దిశగా ఒక ముందడుగు.

సుమారు 6లక్షల చదరపు అడుగుల జి+1 కార్యాలయ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొత్తం మూడు ప్యాకేజీలుగా పిలిచిన అన్ని పనులకు సంబంధించి కేవలం రెండే కంపెనీలు టెండర్లు వేశాయి. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. అయితే ప్రభుత్వం సూచించిన ధర కంటె టెండరు దార్లు వేసిన ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ప్రతినిధులు కొన్ని రోజులుగా వారితో చర్చలు జరుపుతూ వచ్చారు. ఆ నెగోషియేషన్స్‌ ప్రక్రియ కూడా ఆదివారం నాడు ఒక కొలిక్కి వచ్చింది. మొత్తానికి చదరపు అడుగు 3350 రూపాయల వంతున నిర్మాణం చేయడానికి ఈ సంస్థలు అంగీకరించాయి. అంతకంటె తక్కువ మొత్తానికి చేయలేం అని తేల్చిచెప్పడంతో.. ప్రభుత్వం అంగీకరించకతప్పలేదు.

అయితే సర్కారు చేసిన ఒక మంచి పని ఏంటంటే.. నాలుగు నెలల కచ్చితమైన గడువును వారికి విధించింది. కేవలం నాలుగు నెలల్లోగా అనుకున్నట్లుగా పనిని పూర్తిచేస్తే మాత్రమే అనుకున్న విధంగా చదరపు అడుగుకు 3350 రూపాయల ధరను చెల్లిస్తారు. లేకుంటే వారి చెల్లింపుల్లో కోత పడుతుంది. ప్రభుత్వం ఇలా కచ్చితమైన నిబంధన పెట్టడం వలన పనులు వేగంగానే జ రుగుతాయని, జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో తాత్కాలిక భవనాల్లో సెక్రటేరియేట్‌ మొదలు కాగలదని అనుకుంటున్నారు.

ఈ పనులకు శంకుస్థాపన ఎప్పుడనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతానికి 17వ తేదీ శంకుస్థాపన జరగవచ్చునని వార్తలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close