ఏపీలో అంతే..! పోలీసులకు జైలు శిక్షలు..!

పోలీసులు నేరస్తుల్ని పట్టుకుని వారిని కోర్టులో ప్రవేశ పెట్టి.. శిక్షలు విధించేలా చేస్తారు. కానీ ఏపీలో మాత్రం రివర్స్.. కోర్టులు చెప్పిన పని చేయడం లేదని.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని… పోలీసులే జైలు శిక్షలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్‌ వేయాలని ఆదేశించినా ఏసీపీ శ్రీనివాసరావు పట్టించుకోలేదు. దీంతో హైకోర్టు జైలు శిక్ష విధించింది.

ఏసీపీ శ్రీనివాసరావుకు మాత్రమే ఈ పరిస్థితి ఎదురు కాలేదు. అత్యంత సీనియర్ అయిన పోలీసు అధికారుల దగ్గర్నుంచి దిగువ స్థాయి పోలీసు అధికారుల వరకూ అందరిదీ అదే పరిస్థితి. స్వయంగా డీజీపీ .. రూల్ ఆఫ్ లా అమలు చేయడం లేదని పలుమార్లు హైకోర్టు బోనులో నిల్చున్నారు. రాజకీయ కారణాలతో పని చేస్తున్నారని పలువురు ఐపీఎస్‌లపై చర్యలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏపీ సర్కార్ వాటిని పట్టించుకుందా లేదా అన్న సంగతి తర్వాత. పోలీసులు అపహరణలకు పాల్పడుతున్నారని రెండు సార్లు సీబీఐ విచారణకు ఆదేశించింది. వాటిపై విచారణ జరుగుతోంది.

కేసుల్ని నీరుగార్చడం.. నిందితుల్ని రక్షించడం… అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం… వంటివి పోలీసుల విధిగా మారిందన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. సీఐడీ సునీల్ కుమార్ పై కూడా… కోర్టు ధిక్కార కేసు నమోదయింది. పోలీసు విభాగంలోని ఏ వ్యవస్థ కూడా కోర్టుల్నీ లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. ఇది అన్ని వ్యవస్థల్లోనూ ఉంది. పలువురు ఐఏఎస్‌లపై ఇటీవల కోర్టు ధిక్కార కేసులు నమోదయ్యాయి. కానీ మిగతావి వేరు.. పోలీసు వ్యవస్థ వేరు. పోలీసు వ్యవస్థ కూడా.. న్యాయ వ్యవస్థని ధిక్కరించడం ప్రారంభిస్తే.. అంతకు మించిన అరాచకం.. ప్రజాస్వామ్యంలో మరొకటి ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close