3 రోజుల తర్వాత మోదీపై పవన్ పొగడ్తల వర్షం !

శుక్రవారం రోజున ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మోదీకి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మూడు రోజులు ఎందుకు ఆలస్యం అయిందో కానీ.. ఈ ఆలస్యానికి ఏ మాత్రం చింతించకుండా ఉండేలా మోదీని.. సీఎం జగన్ కంటే ఎక్కువగా పొగిడేశారు పవన్ కల్యాణ్. ” ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి ప్రస్థానానికి అద్దంపడతాయని ప్రకటించారు.

నరేంద్ర మోదీ గారిని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతల తెలిపారు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. హిందీలోనూ ఇవే అర్థం వచ్చే ట్వీట్లను పెట్టారు. ప్రధానమంత్రిని పొగుడుతూ పవన్ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్.. రాష్ట్రం నుంచి అన్నీ చెప్పానన్నారు. ఆ తర్వాత సమావేశం గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. కానీ మోదీతో భేటీ తర్వాత పవన్ లో అంత ఉత్సాహం కనిపించలేదని.. ఆయన అనుకున్న స్పందన మోదీ వద్ద నుంచి రాలేదన్న విశ్లేషణలు వచ్చాయి. అందుకే మోదీకి కనీసం కృతజ్ఞతలు చెప్పలేదన్న వాదన కూడా కొంత మంది వినిపించారు. ఈ క్రమంలో సమావేశం జరిగిన మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో తెలుగు, హిందీల్లో .. సమావేశం ఏర్పాటుపై కృతజ్ఞతలు తెలిపారు. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close