టీజేఎస్ కూడా విడతల వారీ ప్రకటనలే….! తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులు ..!!

నామినేషన్లకు గడువు సోమవారంతో ముగిసిపోతున్న సమయంలో.. శనివారం సాయంత్రం… తెలంగాణ జనసమితి నాలుగు సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పీపుల్స్‌ ఫ్రంట్‌ కూటమిలో భాగంగా టీజేఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాను ఆదివారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండారాం తెలిపారు. కోదండరాం పోటీ చేసే అంశంపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దుబ్బాకలో చిందంరాజ్‌ కుమార్, సిద్దిపేట నుంచి భవాని రెడ్డి, మెదక్‌లో జనార్ధన్ రెడ్డి, మల్కాజిగిరిను కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాతో కోదండరాం భేటీ అయ్యారు. పార్టీ కోర్‌ కమిటీతో చర్చించిన అనంతరం నలుగురుతో కూడిని తొలి జాబితాను విడుదల చేశారు.

ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.. ఏఏ స్థానాలు అన్న అంశంపై.. తెలంగాణ జనసమితిలో స్పష్టత లేకుండా పోయింది. కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఎంపిక చేసుకుని వాటిపైనే పట్టుబట్టి ఉంటే.. టీడీపీలాగా.. సీట్లను ఖరారు చేసుకుని ఉండేది. కానీ… రాజకీయ అనుభవం లేకపోవడంతో.. కోదండరాం.. కాంగ్రెస్ పార్టీ నేతల రాజకీయాల ముందు నిలబడలేపోయారు. నెల రోజుల కిందటే… తమ పార్టీకి ఇవ్వాల్సిన సీట్ల గురించి ఆయన కసరత్తు ప్రారంభించినప్పటికీ.. నామినేషన్లు గడువు ముగిసేవరకూ…కూడా.. క్లారిటీ తెచ్చుకోలేకపోయారు. టీజేఎస్ కు ఎనిమిది స్థానాలు ఫిక్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాలేవో చెప్పలేదు. చెప్పాలని కోదండరాం నిలదీయలేకపోయారు. జనగామ విషయంలో రోజుల తరబడి చర్చలు జరిపి.. చివరికి పొన్నాలను కాకుండా… కోదండరాంకే.. సర్దిచెప్పారు కాంగ్రెస్ నేతలు.

కాంగ్రెస్ పార్టీ మరో నాలుగు స్థానాలు ఖరారు చేసింది. అందులో మిర్యాగల గూడ అంశంలో… జానారెడ్డి పీట ముడి వేశారు. తన బంధువుకే టీజేఎస్ తరపున టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జానారెడ్డి సహకరిస్తేనే.. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో టీజేఎస్ నిలబడగలుగుతుంది. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రేపు మిగతా స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తారో.. చివరికి టీజేఎస్ కు అభ్యర్థులు లేరని చెప్పి.. కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయా స్థానాల్లో నామినేషన్లు వేస్తారో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close