మెగా కాంపౌండ్‌లో న‌క్కిన త్రినాథ‌రావు?

వ‌రుణ్‌తేజ్ `గ‌ని` త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈలోగా మ‌రి కొన్ని క‌థ‌ల్ని సెట‌ప్ చేసుకొనే ప‌నిలో బిజీగా ఉన్నాడు వ‌రుణ్ తేజ్‌. ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ సినిమా ఓకే అయ్యింద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. మ‌రోవైపు `గ‌ని` నిర్మాత‌తోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. `భీమ్లా నాయ‌క్‌` ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ఇదివ‌ర‌కెప్పుడో వ‌రుణ్‌కి ఓ క‌థ చెప్పాడు. ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా చేయ‌డానికి రెడీగానే ఉంది. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడి క‌థ‌కీ వ‌రుణ్ ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది. త‌నే త్రినాథ‌రావు న‌క్కిన‌.

ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో `ధ‌మాకా` చేస్తున్నాడు త్రినాథ‌రావు. అది పూర్త‌యిన వెంట‌నే… వ‌రుణ్ తో సినిమా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెర‌కెక్కించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ కథ‌, మాట‌లు అందించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్‌`, `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే`, `థ‌మాకా`ల‌కు… ప్ర‌స‌న్న‌కుమారే ర‌చ‌యిత‌. ఇప్పుడు ఈ కాంబోలో మ‌రో సినిమా రూపుదిద్దుకోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పేరూ పెట్టేశారు !

దిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో...

ట్యాపింగ్ ఇష్యూలో పవన్ ఎంట్రీ – కేంద్ర హోంశాఖకు …

ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్నా, డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్...

నెల్లూరు రూరల్ – అదాల ప్రభాకర్ – వైసీపీకి పీడకలే !

నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజవకర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు....

సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా టీడీపీ ముద్ర – వైసీపీకి ఏం దుస్థితి ?

సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని చుట్టుముడితే అది టీడీపీ సమస్య అన్నట్లుగా తప్పించుకోవాలని చూస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ట్యాపింగ్ సమస్య విపక్ష నేతలు చేస్తే... అది రాజకీయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close