రేవంత్ ని బుజ్జ‌గింజే ప్ర‌య‌త్నం చేస్తున్నారా..?

మియాపూర్ భూ కుంభ‌కోణం… ప్ర‌స్తుతానికి ముగిసిపోయిన అధ్యాయం అన్న‌ట్టుగానే అధికార పార్టీ క‌ల‌రింగ్ ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని తిప్పి కొట్టింది. కొంత‌మందిపై కేసులు పెట్టామ‌నీ, ఆ కుంభ‌కోణాన్ని ప్ర‌భుత్వమే బ‌య‌ట‌పెట్టిందనీ, వేల కోట్ల విలువ చేసే భూముల‌ను అన్యాక్రాంతం కాకుండా సీఎం కేసీఆర్ చేశారంటూ అధికార పార్టీ చెప్పుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కుంభ‌కోణం విషయంలో తెలుగుదేశం వ‌ర్కింగ్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి చాలా లోతైన ప‌రిశోధన‌ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి, ఆయ‌న గ‌తంలోనే కొన్ని ఆధారాలు బ‌య‌ట‌పెట్టారు. కానీ, వాటిపై ప్ర‌భుత్వం స్పందించ‌లేదూ… ప్ర‌ధాన మీడియాలో కూడా త‌గినంత ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. అయితే, మియాపూర్ తోపాటు రంగారెడ్డి జిల్లాలో ప‌లు భూభాగోతాల‌కు సంబంధించిన వివ‌రాలను పెద్ద ఎత్తున సేక‌రిస్తున్నార‌న్న విష‌యం కొంత‌మంది పెద్ద‌ల‌కు ఒకింత గుబులు పుట్టించేలా మారుతోంద‌ని స‌మాచారం!

ఈ తరుణంలో, కొంత‌మంది పెద్ద‌లు రేవంత్ తో రాయ‌బారానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండ‌దండ‌లు దండిగా ఉన్న స‌ద‌రు పెద్ద‌లు, ఓ మీడియా అధిప‌తిని క‌లిశార‌ట‌! భూకుంభకోణాల విష‌యంలో రేవంత్ ను కాస్త త‌గ్గ‌మ‌ని చెప్పాలంటూ ఆయ‌న‌కి విన్న‌వించార‌ట‌! ఆ మీడియా అధిప‌తి కూడా రేవంత్ కి ట‌చ్ లోకి వెళ్లార‌నీ, మియాపూర్ లాండ్ ఇష్యూని ఇక్క‌డితో వ‌దిలెయ్య‌మంటూ సూచించార‌నీ చెప్పుకుంటున్నారు. అయితే, భూకుంభ‌కోణాల విష‌యాన్ని తాను అంత ఈజీగా వ‌దిలిపెట్టేది లేద‌ని రేవంత్ తెగేసి చెప్పిన‌ట్టు క‌థ‌నం. తాను సేక‌రించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెట్ట‌డం ఖాయ‌మ‌నీ, ఈ విష‌యంలో తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని రేవంత్ చెప్పిన‌ట్టు ఓ క‌థ‌నం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

ఈ విష‌యంలో రేవంత్ అంత సీరియ‌స్ గా ఉండటానికి కార‌ణం… గ‌తంలో రేవంత్ పై అధికార పార్టీ అనుస‌రించిన వైఖ‌రే అని చెప్పుకోవ‌చ్చు. దాదాపు అన్ని పార్టీలూ ఫిరాయింపుల్ని ఎడాపెడా ప్రోత్స‌హించిన‌వే. కానీ, ఓటుకు నోటు విష‌యంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడీ భూ కుంభ‌కోణాల అంశాన్ని ప్ర‌ధానాస్త్రంగా మ‌ల‌చుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నారు. మియాపూర్ భూ కుంభ‌కోణాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని, ఇత‌ర అంశాల‌న్నీ ప‌క్క‌న‌పెట్టి రాత్రింబ‌వ‌ళ్లూ ఇదే ప‌నిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబ‌మే ల‌క్ష్యంగా ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేసే రేవంత్… దొరికిన వివ‌రాలేంటో త్వ‌ర‌లోనే బ‌హిర్గ‌తం చేస్తారంటూ టీ టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, రాబోయే రోజుల్లో మియాపూర్ భూదందా వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌ల‌కు కేంద్ర‌బిందువుగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close