హైదరాబాద్‌లో వేల కోట్ల రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన టీటీడీ సభ్యుడు !

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు లక్ష్మినారాయణ హైదరాబాద్‌లో వరుసగా రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి అందరికీ కుచ్చుటోపి పెడుతున్నాయి. లక్ష్మినారాయణకు సాహితి ఇన్‌ఫ్రాటెక్ పేరుతో కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరుతో కొన్ని చోట్ల వెంచర్లు వేశారు. అమీన్‌పూర్‌తో పాటు కొంపల్లిలో హైరైజ్ అపార్టుమెంట్లు కడతామని ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చాడు. బ్యాంక్ లోన్లు లేకుండా డబ్బులు కట్టిన వారికి అతి తక్కువకే ఫ్లాట్లు కేటాయిస్తానని వందల కోట్లు వసూలు చేశాడు.

చెప్పినసమయానికి కనీసం పునాదులు వేయకపోవడంతో మోసపోయామని డబ్బులు కట్టిన బాధితులంతా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. మూడు నెలల కిందటే.. అమీన్ పూర్ వెంచర్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా.. .కొంపల్లి వెంచర్ బాధితులు కేసులు పెట్టారు. అయితే వారందరి కష్టార్జితాన్ని సొంతానికి వాడేసుకున్న ఆయన.. ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. బాధితులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు.

ఏపీ రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో ఎంతో డిమాండ్ ఉన్న టీటీడీ బోర్డు సభ్యుడి పదవిని కూడా పొందారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతోంది. బాధితులు పోలీసు కేసులు పెట్టడమే కానీ.. చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో బాధితులు అన్యాయమైపోతున్నారు. వారి కష్టార్జితమంతా రాజకీయ మోసగాళ్ల చేతిలో ఆవిరైపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close