కేంద్రంపై న్యాయపోరాటంలో ప్రభుత్వానికి ఉండవల్లి ఉడుతభక్తి సాయం..!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. చడీచప్పుడు లేకుండా.. హఠాత్తుగా సచివాలయంలో ప్రత్యక్షమైన ఆయనను చూసి.. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చినందునే తాను వచ్చానని ఉండవల్లి వారికి చెప్పారు. ముఖ్యమంత్రితో దాదాపుగా రెండు గంటలపైగానే చర్చలు జరిపిన మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో లేను..ఏ పార్టీలో చేరనని ఉండవల్లి స్పష్టం చేశారు కాబట్టి ఆయన సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదనుకోవచ్చు. అయితే వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను ఆయన వ్యతిరేకించారు. రాజీనామాలకు నేను వ్యతిరేకం… అయినా గతంలో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశానన్నారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని…ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశానన్నారు.

నా దగ్గర ఉన్న ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేశానన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటి నుంచి… విభజన రాజ్యాంగ విరుద్ధమని పోరాడుతున్నానని గుర్తు చేశారు. దేశ చరిత్రలో పార్లమెంట్ నిబంధనలన్నీ ఉల్లంఘించి… రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారు ఉండవల్లి చెబుతున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఓ పుస్తకం రాశారు. తన పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వాలని చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు.

గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై ప్రసంగించినప్పుడు… విభజన విధానాన్ని తప్పు పట్టారు. పార్లమెంట్ తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. అ పాయింట్ ని పట్టుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తాను గతంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు అడిషన్ డాక్యుమెంట్ సమర్పించారు. దాన్ని ప్రభుత్వానికి కూడా ఇచ్చానని ప్రకటించారు. ఆ తర్వాత ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి ప్రభుత్వం తక్షణం తన పిటిషన్ లో ఇంప్లీడ్ కావాలని డిమాండ్ చేశారు. అలాగే కొద్ది రోజుల కిందట… రాజమండ్రిలో మీడియా సమావేశం పెట్టి… పార్లమెంట్ లో విభజన అంశంపై చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటనను బట్టే… పార్లమెంట్ లో విభజన అంశం చర్చించాలని ఉండవల్లి సూచించారు. అదే సమయంలో ఉండవల్లి పుస్తకం కాపీని.. ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు కూడా తీసుకున్నారని చాలా రోజుల క్రితమే ఉండవల్లి చెప్పారు.

విభజన చట్టం రాజ్యసభలో పాస్ కాలేదని.. రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన లెక్కలే.. ఉండవల్లి పుస్తకంలో ఉన్నాయి. విభజన చట్టం పాస్ అయినప్పుడు రాజ్యసభలో … 353 మంది ఉన్నారు. వారిలో 173 మంది సంతకాలు పెట్టలేదంటున్నారు. అన్నాడీఎంకే, జేడీ యూ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశాయని..బిల్లు పాస్ కావాల్సిన దానికి కావాల్సిన మెజార్టీ లేదని చెబుతున్నారు.

విభజన చట్టం, విభజన హామీల విషయంలో… కేంద్రం చేసిన అన్యాయంపై కోర్టుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల కిందట కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దానికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి..ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే కసరత్తు చేసి ఉండటం.. పిటిషన్లు వేసి ఉన్నారు కాబట్టి.. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఆయనతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close