పెద్దలపై నో యాక్షన్, ఇద్దరు బకరాల సస్పెన్షన్!

హైదరాబాద్ నానక్ రాం గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో అవినీతి కోణం మరోసారి వెలుగుచూసింది. నిర్మాణ లోపం, నాసిరకం పనులు, అనుమతి లేని పనులు వగైరాలన్నీ కలిసి అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. సాక్షాత్తూ కేసీఆర్ కేబినెట్లోని మంత్రి మహేందర్ రెడ్డికి బిల్డర్ స్నేహితుడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు. చివరకు ఇద్దరు జి హెచ్ ఎం సి అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఈ భవన నిర్మాణంలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా, అడ్డగోలుగా ఇంత భారీ భవంతిని కట్టాలంటే తెరవెనుక బడాబాబుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక అండదండలు అందించిన అసలైన దోషులు ఎవరనేది తేలాల్సి ఉంది.

నగరంలో అనుమతులు లేని బడా భవంతుల నిర్మాణం కొత్త కాదు. కట్టకముందే కూలిపోయి అమాయకులు బలికావడం కూడా కొత్త కాదు. ఇటీవలే జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కడుతుండగానే కూలిపోవడంతో ఇద్దరు కూలీలు మరణించారు. మీడియా ముందు హడావుడి చేసే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా అరుదు.

గతంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఇంటి పార్టీ పాలనలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటే తప్ప, ఈ అవినీతి బాగోతం అంతం కాదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close