వరుణ్ తేజ్.. రిస్క్ తీసుకున్నాడు

ఒక స్టార్ డమ్ వచ్చేసిన తర్వాత హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపారు. కొత్త దర్శకులతో కొంత రిస్క్ ఉటుంది. విన్నప్పుడు కధ బావున్నా.. అది తెరపైకి ఎలా వస్తుందో.. ఆ కొత్త దర్శకుడి సినిమాని ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డైలమా వుటుంది. అందుకే సాద్యమైనంత వరకూ ఆల్రెడీ ప్రూవ్ అయిన దర్శకులతోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో కొంచెం రిస్క్ చేస్తే మాత్రం సుకుమార్ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి వస్తారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ తలపండిన రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చాడు. అయితే రెండో సినిమాకే రిస్క్ తీసుకున్నాడు. కొత్త దర్శకుడైన సుకుమార్ తో ఆర్య చేశాడు. ఈ సినిమా సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సుకుమార్, బన్నీ మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు.

ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా మొదటిసారిగా ఇలాంటి రిస్క్ చేస్తున్నాడు. ముకుందతో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ . సీతమ్మ వాకిట్లో లాంటి విజయవంతమైన సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఎంట్రీ. తర్వాత ఆల్రెడీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న క్రిష్ తో జతకట్టాడు. తర్వాత కూడా వందరోజుల సినిమాలు అందించిన పూరితో లోఫెర్ చేశాడు. తర్వాత వైట్ల తో మిస్టర్. ఇప్పుడు కూడా క్లాస్ దర్శకుడు శేఖర్ కమ్ములతో ఫిదా చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు కెరీర్ లో తొలిసారి ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు వరుణ్. అట్లూరి వెంకీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా మొదలుపెట్టాడు. సినిమాకి కొబ్బరికాయ్ కొట్టేశారు. వరుణ్ తేజ్ సినిమాలు చేస్తున్నాడే కానీ నిఖార్సయిన హిట్ పడలేదు. ఇలాంటి నేపధ్యంలో ఓ కొత్త దర్శాకుడికి ఛాన్స్ ఇవ్వడం రిస్కే అయినా.. హిట్ పడితే మాత్రం ‘ఆర్య’ మ్యాజిక్ ను రిపీట్ చేసినట్లు అవుతుంది. అల్ ది బెస్ట్ వరుణ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.