ఎక్స్‌క్లూజీవ్‌: సోషియో ఫాంట‌సీ క‌థ‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

లైగ‌ర్‌, జన‌గ‌ణ‌మ‌న‌… ఇలా వ‌రుస‌గా రెండు సినిమాల‌తో పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల ప్ర‌యాణం దిగ్విజ‌యంగా సాగుతోంది. ఈ బంధం రెండు సినిమాల‌తోనే ప‌రిమితం కాదు. ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా ఈ కాంబినేష‌న్‌లో రాబోతోంద‌న్న విష‌యం… తెలుగు 360 ముందే చెప్పింది. జ‌న‌గ‌ణ‌మ‌న చివ‌రి ద‌శ‌లో.. ఈ హ్యాట్రిక్ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. అయితే… ఈ సినిమా నేప‌థ్యం గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం.. బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజ‌య్ కోసం.. పూరి ఇప్పుడు ఓ సోషియో ఫాంట‌సీ క‌థ‌ని త‌యారు చేశాడ‌ట‌. అది ‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’, ‘యమ‌దొంగ‌` జోన‌ర్‌లో సాగుతుంద‌ని స‌మాచారం. పూరి ఇలాంటి క‌థ రాయ‌డం ఇదే తొలిసారి. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇది వ‌ర‌కు ఈ జోనర్ ట్రై చేయ‌లేదు. సో.. వీరిద్ద‌రికీ ఇది కొత్త క‌థే!

పూరి దగ్గ‌ర క‌థ‌ల‌కు లోటు ఉండ‌దు. ఆయ‌న ద‌గ్గ‌ర బౌండెడ్ స్క్రిప్టులు 50 వ‌ర‌కూ ఉన్నాయి. అందులో… ఇదొక‌టి. ‘లైగ‌ర్’ జ‌రుగుతున్న‌ప్పుడు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ క‌థ చెప్పి విజ‌య్ దేవ‌రకొండ‌ని ఇంప్రెస్ చేశాడు పూరి. ఇప్పుడు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ చేస్తున్న‌ప్పుడే ఈ సోషియో ఫాంట‌సీ క‌థ చెప్పి మ‌రోసారి ఓకే చేయించుకొన్నాడట‌. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెర‌క‌క్కించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close