బాలయ్య విల‌న్‌… ఆయ‌న కాద‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లే. ఆ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఆకాశంలో ఉంటాయ్‌. అందుకే ఈ వ‌చ్చే మూడో సినిమాపై బోయ‌పాటి ప్ర‌త్యేక దృష్టి పెట్టాడు.. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల ఎంపిక విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. బోయ‌పాటి సినిమాల్లో విల‌న్ పాత్ర‌.. హీరో పాత్ర‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఉంటుంది. ఈ రోజు జ‌గ‌ప‌తిబాబు స్టార్ విల‌న్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడంటే కార‌ణం లెజెండ్‌లో ఆయ‌న చేసిన విల‌న్ పాత్రే.

త్వ‌ర‌లోనే షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ తాజా చిత్రంలో కూడా విల‌న్ పాత్ర చాలా కీల‌క‌మ‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌ను శ్రీకాంత్‌ని ఎంచుకున్న‌ట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయ్‌. అయితే ఆ వార్త‌లో ఏ మాత్రం నిజంలేద‌నేది తాజా స‌మాచారం. ఈ సినిమాలో శ్రీ‌కాంత్ న‌టించ‌డం లేద‌ని, ఓ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడే విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్య బాల‌య్య సినిమాలో విల‌న్ గా న‌టించ‌డానికి నేను సిద్ధం.. అని రాజ‌శేఖ‌ర్ ప‌చ్చ జెండా ఊపాడు. ఇప్పుడు బోయ‌పాటి మ‌నసులో కూడా రాజ‌శేఖ‌రే ఉన్న‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య కూడా స‌రే అంటే రాజ‌శేఖ‌ర్‌ని విల‌న్‌గా చూడొచ్చు. మ‌రి ఆ ఛాన్సు ఎవ‌ర్ని వ‌రిస్తుందో చూడాలి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close