తిరుమలను వివాదాల్లోకి తెచ్చి టీటీడీ సాధించిందేంటి..!?

ఆంజనేయుని జన్మస్థలం తిరుమల అంజనాద్రేనని… ఆధారాలు బయట పెట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. దీనిపై అప్పుడే దేశవ్యాప్త చర్చ జరిగింది. ఆంజనేయుని జన్మస్థలాలుగా ఇప్పటికే పేరున్న ఆయా దేవాలయాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం రాను రాను.. పెద్దది అవుతోంది. అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే ఆంజనేయుని జన్మస్థలంగా భక్తులు భావించి.. దర్శించుకునే కర్ణాటకలోని కిష్కింధ దేవస్థానం అధికారులు ఓ ఘాటు లేఖ పంపారు. టీటీడీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసిన కిష్కింధ దేవస్థానం పండితులు… అజ్ఞానపు,మూర్ఖపు పనులు చేయవద్దని హితవు పలికారు.

మీ కమిటీ నివేదిక అభూతకల్పనని మేము నిరూపిస్తామని..వెంటనే తమ లేఖకు సమాధానం ఇవ్వాలని వారు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దివ్యక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ ప్రసిద్ధిని కాపాడాల్సిన టీటీడీ పెద్దలు కొత్తగా చరిత్ర కారులు ఎవరూ చెప్పకుండానే.. ఎలాంటి ప్రతిపాదిక లేని ఆధారాలతో.. ఆంజనేయుని జన్మస్థలం కూడా తిరుమలే అని ప్రకటించుకోవడానికి కారణాలేమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇది పూర్తిగా తిరుమలను ‌అవమానించడమే అన్న చర్చ జరుగుతోంది. నిజంగా తిరుమలనే ఆంజయనేయుడి జన్మస్థలం అయితే… ఏకపక్షంగా ప్రకటన చేయడం… మూర్ఖత్వం.

ఎలాంటి వివాదాలు లేకుండా సాక్ష్యాలతో సహా.. సంబధితులందర్నీ ఒప్పించి.. ప్రకటన చేస్తే… శ్రీవారి క్షేత్రానికీ గౌరవం ఇచ్చినట్లుగా ఉండేది. ఇప్పుడు కిష్కింధ దేవస్థానం అధికారులు వాదనకు దిగుతున్నారు. మూర్ఖపు పని చేశారని టీటీడీని నిందిస్తున్నారు. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. టీటీడీని వివాదంలోకి నెడుతోంది. ఈ పరిస్థితి తేవాల్సిన అవసరం టీటీడీ అధికారులకు ఎందుకు వచ్చిందనేది.. ఇప్పుడు శ్రీవారి భక్తుల ప్రధాన ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close