చంద్రబాబు జాతీయ కూటమి ఎంతెంత దూరం..?

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతాయని… టీడీపీ అధినేత చంద్రబాబు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్ కతాలో ప్రకటించారు. జనవరిలో కోల్ కతాలో బీజేపీయేతర పక్షాల భారీ బహిరంగసభ ను కోల్ కతాలో ఏర్పాటు చేశారు. దీనికి విపక్ష పార్టీలన్నీ హాజరవుతాయన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే.. విపక్షాలన్నీ ఢిల్లీలో సమావేశమవుతాయని చంద్రబాబు ప్రకటించారు.

కాంగ్రెస్‌ ఉంటే పార్టీలు కూటమిలో రావా..?

వాస్తవానికి ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో బీజేపీయేతర కూటమి పక్షాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించాయి. చంద్రబాబు ఈ మేరకు తేదీలను ఖరారు చేశారు. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్.. అమరావతికి వచ్చి.. ఈ విషయంపై చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇక సమావేశం ఖాయమే అనుకుంటున్న సమయంలో… వాయిదా పడింది. దీనికి కారణం.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నేతలందరూ బిజీగా ఉండటమేనని ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో… ఈ పార్టీలు… ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. ముఖ్యంగా.. కాంగ్రెస్ పార్టీపై… సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు చేస్తున్నారు. పొత్తులు కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేస్తున్న వారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఏర్పడే కూటమి సమావేశానికి హాజరవడానికి వెనుకంజ వేశారు. దాంతో.. ఎన్నికల తర్వాత… ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకే వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవకపోతే పరిస్థితి ఏమిటి..?

మమతా బెనర్జీ కర్ణాటక విషయంలో విపక్షాలు ఏకమైన విషయాన్ని కోల్ కతాలో గుర్తు చేశారు. నిజానిదే అదే పెద్ద మలుపు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతలంతా కలసిన సందర్భం అదొక్కటే. అప్పటి నేతల పట్టుదలతో 2019 ఎన్నికలే లక్ష్యంగా జాతీయ మహాకూటమి ఏర్పడుతుందన్న నమ్మకం అందరికీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో కొన్ని పార్టీలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆయా పార్టీలు.. కొన్ని కాంగ్రెస్ తో పోటీ పడుతూండటమే కారణం. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతేనే బీజేపీని ఓడించగలమన్న అభిప్రాయం ఉంది. సమీకరణాలు కూడా అదే చెబుతున్నాయి. అందుకే.. కాంగ్రెస్ ను కలుపుకుని.. పోటీ చేస్తే.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ప్రజల నమ్మకాన్ని చూరగొనవచ్చని చెబుతున్నారు. ఇదే చెప్పి.. మిగతా పార్టీలకు .. కాంగ్రెస్ విషయంలో ఉన్న అభ్యంతరాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లో కలిసిన కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో చేతులు కలపలేకపోయాయి. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు కూటమి కట్టడానికి ఇబ్బందికరంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కాస్త తగ్గి వ్యవహరిస్తోంది. జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ…. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. సీఎం పీఠాన్ని కుమారస్వామికి అప్పగించారు.

డిసెంబర్ 11 తర్వాత చంద్రబాబు కూటమి భవిష్యత్ తేలుతుందా..?

భవిష్యత్లో కూడా కాంగ్రెస్ డామినేషన్కు ప్రయత్నించకుండా.. ఇలాగే వ్యవహరిస్తే…. మాయావతి, అఖిలేష్, మమతా బెనర్జీ లాంటి నేతలు… ఎలాంటి సందేహాలు పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. ప్రాంతీయ సమీకరణాలు జాతీయ కూటమికి అడ్డంకిగా మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో కలుస్తాం అంటున్నారు కానీ.. రాష్ట్రాల పోరాటాల్లో కాంగ్రెస్ తో కలసి నడవడానికి… ముందుకు రావడం లేదు. అంగీకరించలేనన్ని సీట్లు అడగడమో.. మరో ప్రాధాన్యమో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వన్నీ ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు అందరినీ ఒక చోటతి తేవడం అంత సులభం కాదు. పై పెచ్చు వాళ్లలో విభేదాలు ఉంటే బీజేపీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

డిసెంబర్ పదకొండున ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే ఇబ్బందేమీ ఉండదు. కూటమి ఏర్పాటు ఖాయమవుతుంది. కాంగ్రెస్ వెనుకబడితే మాత్రం… ఇబ్బందికర పరిస్థితులు కూటమికి ఏర్పడతాయి. అప్పుడు చంద్రబాబు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది.

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close