అంత అవ‌స‌ర‌మా ఇళ‌య‌రాజా?

ఇళ‌య‌రాజా.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని సంగీత స‌ముద్రం. ఆయ‌న ఎక్కువ‌గా మాట్లాడ‌రు. మాట్లాడినా… అది నా సంగీతం గురించో, పాట‌ల గురించో అయ్యుంటుంది. అయితే తొలిసారి రాజ‌కీయ ప‌ర‌మైన కామెంట్లు చేశారు ఇళ‌య‌రాజా. అది కూడా మోడీని స్తుతిస్తూ. ఆయ‌న్ని అభిన‌వ అంబేద్క‌ర్ అంటూ, అంబేద్క‌ర్ బ‌తికి ఉంటే మోడీ పాల‌న చూసి మెచ్చుకునేవారంటూ స‌గ‌టు బీజేపీ అభిమానిలా మాట్లాడేశారు. బ్లూ క్రాఫ్ట్ డిజిట‌ల్ అనే సంస్థ `అంబేద్క‌ర్ అండ్ మోడీ` అనే ఓ పుస్త‌కం ముద్రించింది. దానికి ఇళ‌య‌రాజా ముందు మాట రాశారు. ఈ సంద‌ర్భంగా మోడీని కీర్తించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. అంబేద్కర్ ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌కు అనుగుణంగా ప‌నిచేసే మోడీ లాంటి వాళ్ల‌ని ప్రోత్స‌హించాల‌ని, ఆయ‌న చేసే కార్య‌క్ర‌మాల‌న్నీ అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని.. ఈమేరకు ఇళ‌య‌రాజా వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా, బేటీ బ‌జావో కార్యక్ర‌మాల‌ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన ఇళ‌య‌రాజా.. రోడ్లు, మెట్రో రైళ్లు, హైవేలూ.. ఇవ‌న్నీ అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఉన్నాయంటే మోడీ చ‌ల‌వే అంటూ కామెంట్లు చేశారు.

మోడీ గురించి ఓ పుస్త‌కం ప్ర‌చురించి, ముందు మాట రాసే అవ‌కాశం ఇస్తే.. ఎవ‌రైనా ఇలానే రాసుకుంటారు. కానీ ఇళ‌య‌రాజా లాంటి వాడికి ఇదంతా అవ‌స‌ర‌మా? అనిపిస్తోంది. ఇప్పుడు ఇళ‌య‌రాజాపై బీజేజీ ముద్ర వేయ‌డానికి ఈ వ్యాఖ్య‌లు ప్ర‌త్య‌క్షంగానే దోహ‌దం చేసేలా ఉన్నాయి. మోడీ, బీజేజీ వ్య‌తిరేకులు.. ఇళ‌య‌రాజా వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం మెడీని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికే ఇళ‌య‌రాజా ఇలా మాట్లాడార‌ని, ఈ వ‌య‌సులో, ఇంత విద్వ‌త్తు సాధించి, ఇళ‌య‌రాజా ఇలా ప్ర‌భుత్వానికి, ప్ర‌ధానికి కొమ్ము కాయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని, ఇప్పటి వ‌ర‌కూ దేశంలో జ‌రిగిన అన్యాయాల గురించో, అక్ర‌మాల గురించో, కుంభ కోణాల గురించో ఏనాడూ ఏ వ్యాఖ్య చేయ‌ని ఇళ‌య‌రాజా.. ఇప్పుడెందుకు మోడీని నెత్తిన పెట్టుకున్నాడో చెప్పాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close