బస్సు ప్రమాదం పాపం ఎవరిది..? కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదు..?

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఒక్క బస్సులో వంద మంది ప్రయాణిస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ప్రమాద వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఆవేదనను ట్వీట్ రూపంలో వెల్లడించారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కూడా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 57 మంది మరణించారంటే అతి ఘోర ఉత్పాతం కింద లెక్క. కానీ ఆపద్ధర్మ సీఎం మాత్రం.. ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. సీఎం కుమార్తె ఎంపీ కవిత, కుమారుడు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాత్రం హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ. 3 లక్షలు ప్రకటించారు. కానీ చనిపోయిన వారి ఇళ్లల్లో మాత్రం దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. చనిపోయింది ఎక్కువగా పేదవాళ్లే. గల్ఫ్ లో..ఇతర చోట్లా… వలసపోయిన రక్తసంబంధీకులు వచ్చే వరకూ.. కనీసం… మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ ను కూడా అద్దెకు తీసుకోలేనంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఐస్ గడ్డపై మృతదేహాలను పెట్టి పొట్టుతో కప్పి భద్రపరుచుకున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ఏ అధికారి వారికి సాయం చేయలేదు. విపక్ష నేతలే.. .గ్రామాలు తిరిగి కొంత మొత్తం సాయం చేస్తున్నారు. అఖిలపక్షం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల సాయాన్ని టీ టీడీపీ నేత ఎల్.రమణ అందించారు. ఆర్టీసీ చైర్మన్‌ను బర్తరఫ్ చేసి మృతుల కుంటుబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వాస్తుపై ఉన్న శ్రద్ధను ప్రజలపై చూపడం లేదని.. అన్ని పార్టీల నేతలు మండి పడుతున్నారు.

ఒకే ప్రమాదంలో .. అదీ ప్రభుత్వ బస్సు ప్రమాదంలో 5 మంది చనిపోతే. పరామర్శించడానికి వెళ్లకపోవడమేమిటన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత ఇంతేనా అని వైపుల నుంచి వమర్శలు వస్తున్నా… మీడియా మాత్రం. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వానికి నొప్పి తెలియకుండా.. విధి రాత అన్నట్లుగా వార్తలు రాస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి ఆపద్ధర్మ సీఎం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కొసమెరుపేమిటంటే.. ఓ వైపు ఘోరకలి చోటు చేసుకుంటే..మరో వైపు కేసీఆర్.. పార్టీకి సంబంధిచి కీలకమైన వ్యవహారాలు మాత్రం చురుగ్గా చక్కబెట్టేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన నేతలు నవ్వుతూ.. తుళ్లుతూ..సురేష్ రెడ్డి ని పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close