కోడి కత్తి కేసు దర్యాప్తును కేంద్ర హోం శాఖ తీసుకుంటుందా..?

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు కీలక మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు.. కేంద్ర హోంశాఖ ఈ కేసు దర్యాప్తు బాధ్యత తీసుకుంటుందా లేదా..అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు అప్పగించాలన్న వాదనపై.. విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్రానికి అభిప్రాయం చెప్పేందుకు పది రోజులు గడువు ఇచ్చింది. వ్యక్తిగత దాడి కాబట్టి తామే విచారిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది.. జరిగింది వినామాశ్రయంలో కాబట్టి… కేంద్ర దర్యాప్తు సంస్థలే దర్యాప్తు చేయాలని పట్టుబట్టారు.

దీంతో హైకోర్టు.. కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 14లోగా జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటన ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందో రాదో.. పది రోజుల్లో చెప్పాలని స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సీఐఎస్ఎఫ్‌ ఇచ్చిన సమాచారం కొంత తమ దగ్గర ఉందని.. కేంద్రం తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టాలని కోరుకుటున్నారు. ఏపీ పోలీసుల దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు.. రక్తపు మరకలు అంటిన చొక్కా.. ఇచ్చినప్పటికీ.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవద్దని ఆయన పిటిషన్ వేశారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం నేపధ్యంలో…కేంద్రం ఈ కేసు దర్యాప్తును తీసుకుంటాందా.. ఎన్‌ఐఏను రంగంలోకి దించుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఇదేమంత పెద్ద కేసు కాదని.. ఎన్‌ఐఏ చెపట్టాల్సిన అవసరం లేదని నివేదిక ఇస్తే… వైసీపీ స్పందన ఎలా ఉంటుందనేది..మరో ఆసక్తికరమైన అంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close