అమరావతికి ప్రపంచబ్యాంక్ రుణమూ పాయే..!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి రుణం ఇవ్వడానికి ప్రపంచబ్యాంక్ వెనుకడుగు వేసింది. ఈ మేరకు.. ప్రాజెక్టుకు రుణప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రపంచబ్యాంక్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఆసియా దేశాల్లోనే అనేక ప్రాజెక్టుల విషయంలో… యాక్టివ్‌గా ఉన్నాయని స్టేటస్ పెట్టిన ప్రపంచబ్యాంక్..అమరావతి విషయంలో మాత్రం .. డ్రాపుడ్‌ అని.. స్పష్టంగా తెల్చేసింది. దీంతో.. మొత్తంగా ఏపీ సర్కార్ అడిగిన 300 మిలియన్ డాలర్ల రుణం ఆగిపోయినట్లే. రాజధానిలో మౌలిక సదుపాయల కల్పన కోసం… చంద్రబాబు సర్కార్ ప్రపంచ బ్యాంక్ ను రుణం కోరింది. అమరావతి ప్రాజెక్ట్ ను పరిశీలించన ప్రపంచబ్యాంక్ రుణం ఇవ్వడానికి అంగీకరించింది. దాంతో.. అప్పట్లో ఏపీ సర్కార్.. మొత్తం డాక్యుమెంట్లను సమర్పించింది. రుణ మంజూరు ప్రక్రియ వేగంగా సాగింది. అయితే.. రాజధాని రైతుల పేరుతో.. కొంత మంది.. అదే పనిగా ప్రపంచ బ్యాంక్ కు ఫిర్యాదులు చేశారు. తమ భూములు బలవంతంగా లాక్కున్నారని.. అక్కడ రాజధాని నిర్మాణానికి ఎలాంటి రుణం మంజూరు చేయవద్దని పదుల సంఖ్యలో ఈ మెయిల్స్‌ను ప్రపంచబ్యాంక్‌కు పంపారు.

దీంతో.. నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు పలుమార్లు అమరావతి వచ్చారు. భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. అయితే.. ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన ఒక్క రైతు కూడా.. ప్రపంచబ్యాంక్ బృందం ముందు తన వాదన వినిపించలేదు. దాంతో.. ఆ ఫిర్యాదులన్నీ అవాస్తవాలేనని అనుకున్న ప్రపంచబ్యాంక్ బృందం.. రుణమంజూరుకు సిద్దమయింది. కొన్నాళ్ల క్రితం.. ఆ సమాచారాన్ని… ఏపీ సర్కార్ కు తెలిపింది కూడా. అయితే.. ఏపీలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో.. ప్రపంచబ్యాంక్ రుణం విషయంలో… మరో ఆలోచన చేసింది. అమరావతిలో మరోసారి పూర్తి స్థాయి ఇన్‌స్పెక్షన్‌ అవసరమనే సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి పంపింది. నెల రోజులకిందటే.. ప్రపంచబ్యాంకు నుంచి ఏపీ సర్కార్‌కు లేఖ వచ్చింది. ఇప్పుడే కొత్త సర్కారు ఏర్పడిందని .. దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు నిర్ణయాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్రానికి ఎలాంటి స్పందనా రాలేదు కానీ.. ఈ రుణ ప్రతిపాదన నుంచి డ్రాపవుతున్నట్లుగా వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

ప్రపంచబ్యాంక్ రుణం కోసం 2016 మార్చి నుంచి ప్రయత్నాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తొలిదశలో రుణం తీసుకునేందుకు కేంద్రం కూడా అనుమతులిచ్చింది. రుణం మంజూరుకు ప్రపంచబ్యాంకు సానుకూలంగానే స్పందించింది. బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో.. రాజధానిలో కొన్ని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని సీఆర్‌డీఏ చేపట్టింది. రాజధానిలో తొలి దశలో నిర్మాణం ప్రారంభించిన రహదారులు ఇలా చేపట్టినవే. రుణం మొత్తంలో కొంత శాతం నిధులతో ముందే పనులు చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు… మొత్తం రుణాన్ని నిలిపివేసినట్లుగా ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. అమరావతికి సంబంధించి నిర్మాణాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోవడం… ప్రస్తుత ఏపీ సర్కార్ ప్రాధాన్యాల్లో అమరావతి లేకపోవడంతో.. ప్రపంచబ్యాంక్ రుణం విషయంలో డ్రాప్ అయిపోయింది. రుణం విషయంలో.. కొత్త ప్రభుత్వం.. ఎలాంటి ఆసక్తి చూపించలేదు కూడా. అదే సమయంలో… అమరావతికి ఆసియా డెలవప్‌మెంట్ బ్యాంక్ ఇచ్చందుకు సిద్ధమైన 1400 కోట్ల రుణం కూడా.. డౌట్‌గా మారింది. ఈ మొత్తం రుణాల వ్యవహారం… అమరావతిపై పడనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close