అమరావతిపై వైట్‌ పేపర్ రెడీ..! సాక్ష్యాలా..? ఆరోపణలా..?

“అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇది అతి పెద్ద కుంభకోణం .. దీన్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదు. నేను రాగానే విచారణ జరిపిస్తాను..” అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్ష నేతగా ఉన్నన్ని రోజులూ… వార్నింగ్ ఇచ్చారు. అలా అన్నట్లుగా ఆయన ఇప్పుడు.. ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిపై దృష్టి కేంద్రీకరించారు. తాను చేసిన ఆరోపణలు కాదు.. నిజాలేనని నిరూపించడానికి.. అసలేం జరిగిందో వెల్లడించడానికి.. వైట్‌ పేపర్ విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయిందంటున్నారు.

వైట్‌పేపర్‌లో ” ఇన్‌సైడర్ ట్రేడింగ్ ” ..!

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అనేది ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లో వినిపించే పదం. ఏదైనా సంస్థ లేదా.. వ్యవస్థ నుంచి కచ్చితమైన రహస్య సమాచారం పొంది.. దాని ఆధారంగా లావాదేవీలు నిర్వహించే స్కాంను ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. “రాజధాని ఫలానా చోట వస్తుందని… చంద్రబాబుకు తెలుసు. ఆ విషయం తన సన్నిహితులకు చెప్పారు. ఆ తర్వాత వారు ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అధికారిక సమాచారాన్ని సన్నిహితులకు లీక్ చేసి… భూములు కొనుగోలు చేసేలా ప్రొత్సహించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనేది…” జగన్ మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. తాను చేసిన ఆరోపణు నిజమేనని.. శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో సంచలనాత్మక విషయాలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పూర్తి వివరాలు బయటకు రాబట్టారని… ఎవరెవరు.. ఎంత పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారో.. లెక్కలు బయటకు తీశారని… ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వైసీపీ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు, రాజధాని ప్రకటన మధ్యలో ఎవరెవరు భూములు కొన్నారు..?

ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో నియమితులైన శివరామకృష్ణన్ కమిటీ.. రాజధాని కోసం.. కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల ప్రకారం… చాలా మంది.. ప్రకాశం జిల్లా దొనకొండ రాజధాని అవుతుందని అనుకున్నారు. ఎన్నికలు జరగకముందే పెద్ద ఎత్తున అక్కడ భూములు కొనుగోలు చేశారు. కానీ.. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు… ప్రజారాజధానిగా ఉండాలని భావించి… అమరావతిని ఎంపిక చేశారు. ఆ సందర్భంగా కొంత కసరత్తు జరిగింది. పలు ప్రాంతాలు పరిశీలనకు వచ్చాయి. చివరికి అమరావతిని ఫైనల్ చేశారు. ఈ మొత్తం… తొమ్మిది నెలల్లో పూర్తయిపోయింది. జూన్, 2014 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మార్చి 2019లో కొత్త రాజధాని ఎనౌన్స్‌మెంట్ చేశారు. ఈ లోపే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, వారి బినామీలు భూములు కొనుగోలు చేశారనేది జగన్ ఆరోపణ. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ డీటైల్స్ అన్నీ బయటకు తీస్తున్నారు.

సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తారా..?

చంద్రబాబు.. ఫలానా చోట రాజధాని పెడతారని.. సన్నిహితులకు చెప్పారని.. అందుకే వారు.. వేల కోట్లు వెచ్చించి.. వందల ఎకరాలు కొనుగోలు చేశారని చెబుతూ ఉంటారు. ఇప్పుడు… ప్రభుత్వం వెల్లడించే శ్వేతపత్రంలో .. రాజధాని ఏరియాలో.. ఏ ఏ టీడీపీ నేత.. ఎంత పెద్ద మొత్తంలో.. భూములు కొనుగోలు చేశారో.. సేల్ డీడ్ వివరాలతో సహా వెల్లడించే అవకాశం ఉంది. గతంలో సాక్షి పత్రిక.. అమరావతిపై కొన్ని కథనాలను ప్రచురించింది. దాదాపుగా.. అవే వివరాలు ఉండే అకాశం ఉందని చెబుతున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఏమైనా వివరాలు వస్తే.. వాటిని కూడా.. చేరుస్తారు. మొత్తం ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన వివరాలు అన్నీ ప్రజల ముందు ఉంచిన తర్వాత సీబీఐ లేదా.. మరో సంస్థ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. వైట్‌పేపర్‌లో.. సాక్ష్యాలు కూడా ఇస్తారా లేక సాక్షి పేపర్‌లో వచ్చిన ఆరోపణలే బయట పెడతారా అన్నది కీలకం.

అమరావతి భవితవ్యం కూడా వైట్‌పేపర్‌లో ఉంటుందా..?

రాజధాని నిర్మాణంపై జగన్ అంత సుముఖంగా లేరని.. చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. దానికి తగ్గట్లుగానే ఆయన ఇంత వరకూ రాజధానిని నిర్మిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు.. విచారణకు ఆదేశించిన తర్వాత… బయటపడే వివరాలను బట్టి.. రాజధానిని నియంత్రించే అవకాశం ఉందంటున్నారు. రాజధానికి.. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు చాలని… గతంలో వైసీపీ వర్గాలు చెప్పాయి. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా జగన్ కి ఇదే సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు. విజయవాడ లేదా గుంటూరుల్లో.. ఈ తరహా పాలనా యంత్రాంగాన్ని నిర్వహించడానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే… సరిపోతుందన్న అభిప్రాయానికి వస్తున్నారు. మొత్తానికి అమరావతిపై.. జగన్ .. సంచలన నిర్ణయాలే తీసుకోబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close