చైతన్య : జగన్ ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడకు .. ప్లీజ్..!

రాష్ట్రవ్యాప్తంగా.. వైసీపీ నేతలు… మద్యం పంపిణీ కోసం ఓ నెట్ వర్క్ నడుపుతున్నారు. మద్యం పంపిణీకి వైసీపీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంది. ఇటీవల పోలీసుల దాడుల్లో వరుసగా మద్యం పట్టు బడుతోంది. చిత్తూరులో ఓ వైసీపీ నేత తోటలో.. ఏకంగా ఓ లోడు మద్యం పట్టుబడింది. చంద్రగిరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. చీరాలలోనూ.. దాచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దొరికినంత వరకూ దొరుకుతోంది. మిగతా అంతా పంపిణీ చేస్తున్నారు. బహిరంగసభలు ఏర్పాటు చేసి నదగ్గర పరిస్థితిని అసలు అంచనా వేయలేకపోతున్నారు. ఇతర పార్టీల్లోనూ ఉంది కానీ… మరీ బరి తెగించిన స్థాయిలో వైసీపీ వ్యవహారం ఉంది.

చీప్ లిక్కర్ పంపిణీ కేసుల్లో వైసీపీ నెంబర్ వన్..!

గత ఎన్నికల సమయంలోనూ… వైసీపీ నేతలు ఇదే పని చేశారు. ప్రత్యేకంగా గోవాలో ఓ నకిలీ మద్యం కంపెనీనే ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2014 ఎన్నికల సమయంలో పట్టుబడిన మద్యం అంతా ఒకే బ్రాండ్. ఇలా మద్యం పట్టుబడటంతో పొన్నూరు వైసీపీ అభ్యర్థి రావి వెంకటరమణ.. పోలింగ్ కు ముందు వారం రోజుల పాటు అదృశ్యమయ్యారు. నెల్లూరు జిల్లాలో ఈ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు.. ఆ కేసులు కావలి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలపై ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పద్దతిలో మద్యాన్ని పారిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ ప్రచారంలో ఇపుడు లిక్కర్‌ సీసాలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. క్వార్టర్‌ సీసాలను ఎరగా వేస్తూ.. జనాలను సభలకు తరలిస్తున్నారు. అక్కడా.. ఇక్కడా అని కాదు… విజయనగరం నుంచి చిత్తూరు వరకు మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా పంపిణీ చేస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ..!

నేతలే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు కదా..!

వైసీపీ కార్యకర్తలేనా..! నాయకులు, ఆ పార్టీ అభ్యర్థులు కూడా తాగుతున్నారు. ఊగుతున్నారు. రోడ్డుపై హంగామా చేస్తున్నారు. ఇదిగో నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణమ రాజు… మీటింగ్‌కు ముందే పూటుగా తాగేసి వచ్చారు. మైక్‌ చేతిలో పట్టుకొని ఊగిపోతున్నారు. అంతకు ముందు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌ ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణం దొమ్మలపాళ్యం వద్ద హల్‌చల్‌ చేశారు. వైన్‌ షాపుల వద్దే కాకుండా రోడ్లపైన కూడా తప్ప తాగుతూ ఊగిపోతున్నారు. అయితే అధినేత మద్యనిషేధం చేస్తానని చెబుతుంటే.. ఆ పార్టీ నేతలు, శ్రేణులు మాత్రం మద్యాంధ్రప్రదేశ్‌ చేసే రేంజ్‌లో తాగుతున్నారు.. తాగిస్తున్నారు..!

మద్యనిషేధం కాదు… మద్యం తాగేవాళ్లలో మార్పు తేవాలి..!

మద్యనిషేధం అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం.. వారి కార్యకర్తలు, నేతల తీరుతోనే… తేలిపోయింది. అయినా ఏ మాత్రం అవగాహన లేకుండా.. మద్యనిషేధం అనే హామీని జగన్ ఎందుకు ఇస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఎక్కడా.. మద్యనిషేధం అనే హామీ అమలు కాలేదు. విజయవంతం కాలేదు. ఆర్థిక పరంగా… ప్రభుత్వాలకు గొప్ప వనరు తగ్గిపోవడం అన్నది మాత్రమే కీలకం కాదు… అలాంటి నిషేధాన్ని అమలు చేసే వ్యవస్థ లేదు. ఎందుకంటే.. గుట్కాలను ఎప్పుడో నిషేధించారు. కానీ.. ఒక్కరైనా.. దాన్ని ఆపు చేయగలుగుతున్నారా..? ఎక్కడైనా దొరుకుతుంది. తయారీ ఆగలేదు.. అమ్మకాలు ఆగలేదు. కానీ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను మాత్రం రాదు. అయితే బ్లాక్ పేరుతో దాని విలువను పెంచేశారు. ఫలితంగా.. బానిసలుగా మారిన వాళ్లకు అదనపు ఖర్చు. ఇక్కడ… సమస్యకు పరిష్కారం నిషేధం విధించడం కాదు… అలవాటు పడిన వాళ్లను మార్చడం. ఓట్ల కోసం డైలాగులు చెప్పే నేతలు దీన్ని ఎప్పుడూ చేయరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close