మైనార్టీ సభలో అలజడితో వైసీపీ మరో సారి బుక్కయిందా..?

రాజకీయాల్లో ప్లాన్లు బెడిసికొడితే పరువు పోతుంది. ఎంతగా సమర్థించుకున్నా… నమ్మేవారుండరు. కుట్ర అంటూ రివర్స్ ఆరోపణలు చేస్తే అందరూ జాలిగా చూసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇంతే ఉంది. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు..మైనార్టీలను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగా “నారా హమారా – టీడీపీ హమారా” నినాదాన్ని మైనార్టీల్లోకి తీసుకెళ్లి సభ నిర్వహించారు. బీజేపీతో సన్నిహితమవతున్నారన్న ప్రచారాన్ని ఖండించలేక … మైనార్టీలను దూరం అయిపోతున్నా.. ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది. దీన్ని కవర్ చేసుకోవడానికి… ఓ ఎత్తుగడ వేసింది. అదే.. టీడీపీ మైనార్టీ సదస్సులో తమ కార్యకర్తలను చొప్పించి.. ఆందోళన చేయించి.. తమ మీడియాలో హైలెట్ చేస్తే.. మైనార్టీలు టీడీపీని నమ్మడం లేదని ప్రచారం చేయడం. దానికి తగ్గట్లుగా ప్లాన్ వేసుకున్నారు. అమలు చేశారు. కానీ సాక్ష్యాలతో సహా దొరికిపోయారు.

గుంటూరులో జరిగిన టీడీపీ మైనార్టీ సదస్సులో అలజడి రేపేందుకు .. ప్రయత్నించిన యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ నంద్యాల వాసులు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూండగా.. సభలో కొంత మంది యువకులు అలజడి రేపారు. గట్టిగా నినాదాలు చేస్తూ పక్కనున్న వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సభకు వచ్చిన ముస్లిం మహిళలు భయపడే విధంగా.. అరుస్తూ భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో పోలీసులుకు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెల్లడయ్యాయి. తెలుగుదేశం పార్టీ సభలో.. అలజడి రేపడానికి ప్రయత్నించిన వారంతా.. నంద్యాలకు వైసీపీ కార్యకర్తలు. అంతకు ముందు ఎస్‌డీపీఐ అనే సంస్థలో సభ్యులుగా ఉండేవారు. వారికి హబీబుల్లా అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరించేవారు. నంద్యాల ఎన్నికల సమయం వీరంతా… శిల్పా చక్రపాణిరెడ్డి నేతృత్వంలో.. వైసీపీలో చేరారు. గుంటూరు మైనార్టీ సదస్సులో అలజడి రేపేందుకు హబీబుల్లా వీరందర్నీ… ఒక రోజు ముందుగానే రైల్లో గుంటూరుకు తీసుకు వచ్చారు. సభలో ఎలా అలజడి రేపాలో సూచనలు చేసి పంపించారు. ఇలా అలజడి రేపిన ఓ యువకుని దగ్గర సెల్ ఫోన్ సమాచారాన్ని పోలీసులు సేకరించారు. అందులో మెసెజుల్లో ఆందోళన చేయమని వేరే వ్యక్తి నుంచి అందుకున్న ఆదేశాలు ఉన్నాయి. హబీబుల్లానే తమను… సభలో అలజడి రేపమని పంపించారని.. వారు పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు.

పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన అత్యంత సున్నితమైన విషయం కావడంతో.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలజడికి ప్రయత్నించిన వారందర్నీ అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరెవరున్నారో విచారణ జరుపుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారంతా.. నిరుపేదలు, పేద కుటుంబాలకు చెందిన వారే. చిరు వ్యాపారాలు చేసుకుంటూ… జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొంత మందికి చదువు కూడా రాదు. తాము చెప్పినట్లు చేస్తే.. కేసుల్లో ఇరుక్కున్నా… జగన్ సీఎం అయిన తర్వాత బయటకు తెస్తామని.. పదవులు ఇస్తామని శిల్పా వర్గీయులు యువకుల కుటుంబాలను బతిమాలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ అరెస్టులంటూ.. వైసీపీ నేతలు ఎంత రచ్చ చేసినా.. ప్రత్యర్థి పార్టీ సమావేశంలోకి చొరబడి రచ్చ చేయడమేమిటన్న ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close