ఆ నిధులు ఓటర్లకు చేరకుండా వైసీపీ వ్యూహం..! అది ప్లస్సా…మైనస్సా..?

సంక్షేమం పేరుతో.. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందుగా పెద్ద ఎత్తున ఓటర్లకు.. నగదు పంపిణీ పథకాలు చేపట్టింది. అవన్నీ వరుసగా… ప్రజలకు చేరుతున్నాయి. ఎన్నికల కోసమే పెట్టారన్నట్లుగా కాకుండా… ముందు నుంచే పంపిణీ చేస్తోంది. పదకొండో తేదీన ఎన్నికలు జరుగుతూంటే.. ఒకటో తేదీన పెన్షన్లు, నాలుగో తేదీన డ్వాక్రా మహిళలకు రూ. నాలుగు వేలు, ఏడో తేదీన రుణమాఫీ నాలుగు, ఐదు విడతలు.. ఇలా.. మొత్తంగా రూ. పది వేల కోట్లకుపైగానే పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంగా రెండు పక్షాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు పై కూడా ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతుంది, తెలుగుదేశం ప్రభుత్వానికి గత ఐదు సంవత్సరాల కాలంలో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పసుపు – కుంకుమ, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున పసుపు – కుంకుమ కింద పంపిణీ చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో చంద్రబాబు ఒక్కో డ్వాక్రా మహిళకు పది వేల రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు 2వేల 500రూపాయలు, 3వేల 500 రూపాయల చెక్కులు ఇవ్వగా.. మహిళలు వాటిని డ్రా చేసుకున్నారు. మూడవ విడత 4 వేల రూపాయలు వచ్చే నెల ఐదో తేదీకి మహిళల ఖాతాల్లో జమ అవుతాయి. ఇందుకోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రస్తుతం బ్యాంకుల్లో వేయాల్సి ఉంది. ఈ నిధుల విడుదలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రెండు లేదా మూడు తేదీల్లో బ్యాంకులకు విడుదల చేయనున్నారు. మరోవైపు రైతులకు రుణమాఫీ కింద నాలుగు, ఐదు విడతలు కలిపి 8వేల 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ రెండు పధకాలకు నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు రెడీ చేసింది. అయితే దీని పై కూడా ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అస్త్రాలను తయారుచేసుకుంది. ఎన్నికల సమయంలో మహిళలను, రైతులను ప్రభావితం చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఏప్రిల్ పదకొండో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరగబోతోంది. ఈ పోలింగ్ కు వారం రోజుల ముందు నిధుల విడుదల ప్రభావితం చేస్తుందని వైసీపీ చెబుతున్నప్పటికీ … ఈ వాదనను తెలుగుదేశం, రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రాష్ట్రంలో రుణమాఫీ పధకం గత ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతుందని, ఇది కొత్తగా ప్రవేశ పెట్టిన పధకం కాదని, తేల్చిచెప్పారు. మరోవైపు పసుపు కుంకుమ కూడా ఫిబ్రబరి నుంచి కొనసాగుతుందని, మూడవ విడత డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు అందిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. రైతుబంధు పథకాన్ని ఈసీ నిలిపివేయలేదని గుర్తు చేస్తున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసి ఆపిస్తే మాత్రం.. దీన్నో అస్త్రంగా చేసుకోవాలని టీడీపీ నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close