ఏపి, తెలంగాణా భాజపా నేతలు కెసిఆర్ పై విమర్శలు

తెలంగాణా న్యాయవాదుల డిమాండ్ల పరిష్కారం, హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ డిల్లీలో ధర్నా చేయాలనుకొన్నట్లుగా వచ్చిన వార్తలపై ఇంకా ప్రకంపనలు కలుగుతూనే ఉన్నాయి. విశేషమేమిటంటే, ఆ రెండు లక్ష్యాలకి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ పూర్తి మద్దతు ప్రకటిస్తూనే మళ్ళీ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే, దీనిపై తెలంగాణా పార్టీలతో బాటు ఆంధ్రాలో పార్టీలు కూడా స్పందిస్తున్నాయి.

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు విభజనకి అంగీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడాది మార్చిలోనే లేఖ ఇచ్చారని చెప్పడం మరో విశేషం. మరయితే విభజనకి ఎందుకు సహకరించడం లేదు? అనే సందేహం కలుగుతుంది. తెలంగాణాపై కర్ర పెత్తనం చేసేందుకేనని తెరాస నేతలు వాదిస్తున్నారు. కానీ తెరాసయే ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని ఏపి, తెలంగాణా తెదేపా నేతలు వాదిస్తున్నారు. ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకు కెసిఆర్ న్యాయవ్యవస్థని సైతం వాడుకోవడానికి వెనకాడటం లేదని తెదేపా ఏపి అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు నాయుడుకి సంబంధం లేకపోయినా ఆయన పేరు చెప్పుకొని తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

తెలంగాణా భాజపా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “కెసిఆర్ డిల్లీలో ధర్నా చేయడం కంటే అమరావతిలో చేస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాను. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు ప్రయత్నించకుండా సమస్యని ఇంకా పెద్దది చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను,” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ భాజపా నేత మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మరోవిధంగా స్పందించారు. “హైకోర్టు విభజన జరిగితే గానీ సంపూర్ణ తెలంగాణా ఏర్పడినట్లు కాదని వాదిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగా షెడ్యూల్ 9, 10ల క్రింద ఉన్న సంస్థలని విభజించి ఆ తరువాత హైకోర్టు విభజన గురించి మాట్లాడితే బాగుంటుంది. నిజానికి కెసిఆర్ ని ప్రసన్నం చేసుకోనేందుకే ఆనాడు యూపియే ప్రభుత్వం అడ్డుగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఏపికి తీరని అన్యాయం చేసింది. విభజన వలన అన్ని విధాల తెలంగాణాయే ప్రయోజనం పొందింది. ఇప్పుడు హైకోర్టు విభజనకి కూడా కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. ఆ వ్యవహారం హైకోర్టులోనే ఉందని కెసిఆర్ కూడా తెలుసు. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యని ఏమార్చడానికే కెసిఆర్ డిల్లీలో దీక్ష అంటున్నారని నేను భావిస్తున్నాను,” అని కామినేని శ్రీనివాస్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close