విజయవాడకు ఫేస్ లిఫ్ట్ – పుష్కర ఏర్పాట్లకు తుది మెరుగులు

కృష్ణా పుష్కరాల కౌంట్ డౌన్ రోజులనుంచి గంటల్లోకి మారింది. విజయవాడ ప్రాంతానికి ఫేస్ లిఫ్ట్ తీసుకురావడం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి భారీ ప్రచారంతీసుకురావడం ఈ పుష్కరాల థీమ్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక వచ్చిన అతిపెద్ద సోషల్, కల్చరల్ ఈవెంటుగా గత ఏడాది గోదావరి పుష్కరాల థీమ్ ను నిర్ణయించారు.

ఈ రెండు పుష్కరాలకూ కేంద్రం నుంచి నిధులు లేవు. రాష్ట్రప్రభుత్వంలోని అన్ని శాఖలూ వాటివాటి నిధులను పూలింగ్ పద్ధతిలో రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఖర్చు చేశాయి. యాత్రీకులకు సదుపాయాలు సమకూర్చడంలో గోదావరి పుష్కరాల మాదిరిగానే కృష్ణాపుష్కరాల్లో కూడా స్వచ్చంద సంస్ధలను పక్కనపెట్టేశారు. రాజమహేంద్రవరంలో మొదటిరోజు తొక్కిసలాటలో 29 మంది చనిపోయిన దుర్ఘటనను దృష్టిలో వుంచుకుని విజయవాడలో క్రౌడ్ మేనేజిమెంటుకి పోలీసులు పటిష్టమౌన ప్రణాళిక రూపొందించారు. అయితే వాహనం దిగింది మొదలు ఏదో ఒక ఘాట్ కు చేరేవరకూ యాత్రికులు సగటున 3 కిలోమీటర్లు నడవవలసిన పరిస్ధితి వుంది. గోదావరి పుష్కరాల్లో ఇది రెండు కిలోమీటర్లకంటే తక్కువ.

రాజమహేంద్రవరంలో ఘాట్ల వద్దే ఆహారపొట్లాలను అందజేశారు. విజయవాడలో ఫిక్స్ డ్ పాయింట్ల వద్దే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశాము ఎవరైనా అక్కడికి వెళ్ళి తినవలసిందేనని స్పెషల్ ఆఫీసర్ చెప్పారు. వినియోగదారుల సౌలభ్యం నుంచిగాక సరఫరా యంత్రాంగం సౌకర్యాన్ని దృష్టిలో వుంచుకునే అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. రాజమహేంద్రవరంలో కూడా మొదట ఇదే నిర్ణయం తీసుకున్నారు. పుణ్యస్నానాలు ముగించిన వెంటనే యాత్రికులు అక్కడినుంచి తొలగిపోయేలా చూస్తే రద్దీని నివారించవచ్చు. ఫుడ్ పాయింట్ల వద్దకు అందరినీ చేర్చే పద్ధతి వల్ల అక్కడ రద్దీ పెరుగుతుందని విలేకరులు సూచించడంతో ఆప్రకారమే ఘాట్లవద్దే ఫుడ్ పాకెట్స్ పంపిణి జరిగేలా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

గోదావరి పుష్కరాల్లో మొదటి రోజుదుర్ఘటన, అన్నిరోజులూ ముఖ్యమంత్రి రాజమహేంద్రంలోనే వుండటం, ప్రతీ సమస్యనూ ఆయనే పట్టించుకోవడం, మొదలైన కారణాలవల్ల ”రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొరతా” అన్నట్టు నిర్ణయాలు జరిగాయి. మంచినీళ్ళలా డబ్బులు ఖర్చయిపోయాయి. ఫలానా ఘాట్ వద్ద తాగునీళ్ళు లేవని ఓ వృద్ధురాలు అర్ధరాత్రి తనిఖీల్లో ముఖ్యమంత్రికి చెప్పింది… ఆయన ఆదేశాల ప్రకారం విజయవాడ గుంటూరు విశాఖ హైదరాబాద్ నగరాలకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి. మరుసటి రోజు సాయంత్రానికల్లా వాటర్ సాచెట్లు వరదలా రాజమహేంద్రవరం వీధుల్లో క వచ్చేశాయి. పుష్కరాలు ముగిసిన 20 రోజులకి మున్సిపల్ కార్పొరేషన్ వారు 4 లక్షల రూపాయలు విలువ చేసే 10 లక్షల వాటర్ సాచెట్లను డంప్ యార్డు దగ్గరలో పాతిపెట్టించారు.

అధికారులు రూపొందించిన బ్లూప్రింట్ ఎలా డస్ట్ బిన్ లోకి పోయిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణమాత్రమే! మొదటి రోజు విషాదం జరిగి వుండకపోతే అంతా ప్రణాళికప్రకారమే జరిగిపోయి వుండేది.

గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో వుంచుకని కృష్ణాపుష్కరాల్లో ఏర్పాట్లకు అధికారులు మెరుగులుదిద్దారు. ముఖ్యమంత్రి నివశిస్తున్న నగరంలోనే ఈ పెద్ద ఈవెంటు జరుగుతోంది. ఆయన ఏక్షణంలోనైనా చొరబడి ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది. అలాజరగకపోతే ఇప్పటికే వున్న బ్లూప్రింటు ప్రకారం ఏర్పాట్లు వుంటాయి.

గోదావరి పుష్కరాలమాదిరిగానే కృష్ణా పుష్కరాల్లో కూడా తెలుగుదేశం అండదండలున్న కాంట్రాక్టరు రింగైపోయి, టెండర్లు వేయకుండా ఐక్యత ప్రదర్శించి నామినేషన్ల పై ఎక్కువరేటుకి వర్క్ ఆర్డర్లు పొందారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండుసార్లు గోదావరి పుష్కరాలను నిర్వహించారు. కృష్ణా పుష్కరాల నిర్వహణ ఇదే మొదటి సారి. రాజధానిప్రాంతం, అతిముఖ్యమైన నగరం విజయవాడలో రోడ్ల విస్తరణకు చిన్నా పెద్దా గుడులను తొలగించడం వివాదంకాకుండా హాండిల్ చేయడం చంద్రబాబు సామర్ధ్యానికి పెద్దవిషయమేమీ కాదు. రోడ్ల విస్తరణతో సహా పౌరసదుపాయాల కల్పనకు కృష్ణా పుష్కరాలను వేదికగా వినియోగించుకోగల ఆయన విజనే ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విశేషం!

విజయవాడ ఫేస్ లిఫ్ట్ కోసం పుష్కర సన్నాహాలను సమన్వయం చేయడంలో చంద్రబాబు నాయుడు మేనేజీరియల్ నైపుణ్యాలను ఆయన ప్రత్యర్ధులుకూడా ప్రశంసించవలసిందే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close