‘ఐతే నాకేంటి…?’ అదే అసలు సమస్య ఆర్పి

తేజ, ఉదయ్‌కిరణ్, ఆర్పి పట్నాయక్‌లు ముగ్గురూ కూడా కెరీర్ ప్రారంభంలోనే సంచలన విజయాలు సాధించారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం వాళ్ళ వైపు చూసేలా చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కష్టపడి ఉంటే ఈరోజు ఏ స్థాయిలో ఉండేవాళ్ళో కానీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్, సక్సెస్‌తో వచ్చే అనేక రకాల మైనస్‌లు వీళ్ళ ముగ్గురి కెరీర్‌లను డిస్టర్బ్ చేశాయి. సక్సెస్‌ని నిలబెట్టుకోవడంలో ముగ్గురూ ఫెయిల్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పీక్స్‌లో ఉన్న ఆర్పీ పట్నాయక్ కూడా హీరోగా, డైరెక్టర్‌గా కూడా సక్సెస్ అవ్వాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆర్పీ ఇచ్చే సంగీతంలో క్వాలిటీ తగ్గింది. హీరోగా, డైరెక్టర్‌గా కూడా ఒక్క బ్రోకర్ సినిమా తప్ప వేరే ఏ సినిమా కూడా ఆర్పీ కెరీర్‌కి ప్లస్ అయింది ఏమీలేదు.

ఇప్పుడు మరోసారి హీరోగా, డైరెక్టర్‌గా ‘మనలో ఒకడు’ అనే సినిమాతో మనముందుకు వస్తున్నాడు ఆర్పి. ఈ సినిమా టీజర్ బాగుంది. మరోసారి ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ కథనే సెలక్ట్ చేసుకున్నాడు ఆర్పి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే బ్రోకర్ లాంటి సినిమా కోసం ప్రయత్నం చేసినట్టున్నాడు. తెలుగు ప్రజల్లో ఎక్కువ మంది ఇప్పుడు మీడియాను తిట్టుకుంటూ ఉన్నవాళ్ళే. సో..ఈ సబ్జెక్ట్ కూడా ప్రేక్షకులకు ఈజీగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సాయికుమార్ క్యారెక్టర్ ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం సృష్టించిన ఓ మీడియా సంస్థ అధిపతిని గుర్తుకు తెస్తోంది. అలాగే గొల్లపూడి మారుతీరావు చేత కూడా ఓ మంచి క్యారెక్టర్ చేయించడం బాగుంది. టెక్నికల్ క్వాలిటీ కూడా బాగుంది. మ్యూజిక్ కూడా ఒకె.

కానీ సమస్యల్లా ‘అయితే నాకేంటి?’ అన్న ఆర్పీ ఆలోచనతోనే. చాలా గొప్ప డైరెక్టర్, నటుడు అయిన దాసరి నారాయణరావు, కె. విశ్వనాథ్‌లు కూడా వాళ్ళు దర్శకత్వం చేసిన సినిమాలలో హీరోలుగా నటించాలనో, మొత్తం పేరు వాళ్ళకే వచ్చేయాలనో తపించలేదు. తనకు బాగా నప్పుతుంది అన్న క్యారెక్టర్స్‌లో మాత్రమే దాసరి నటించేవారు. అలాగే హీరోగా కూడా సక్సెస్ అవుదామని ప్రయత్నం చేసిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి రెండిటికీ చెడ్డ రేవడి అయిపోయిన చరిత్ర మన కళ్ళముందే జరిగింది. ది బెస్ట్ వాయిస్ ఉన్న సాయికుమార్‌తో పోటీ పడదామనుకున్న ఆర్పీ ‘అయితే నాకేంటి’ అన్న డైలాగ్‌ని కూడా అరిచి మరీ చెప్పాడు. మొహమంతా కదిలిపోయింది. కానీ ఆయన కష్టపడి నటిస్తున్నాడన్న ఫీలింగ్ వస్తోంది కానీ క్యారెక్టర్ అయితే కనిపించడం లేదు. పౌరాణికాలు, శివపుత్రుడు, కోయి మిల్ గయా, బాహుబలి లాంటి సినిమాలు పక్కన పెడితే రెగ్యులర్ సాంఘిక సినిమాల్లో నటించడం చాలా ఈజీ అన్నట్టు ఉంటుంది. ఆ నలుగురు, ఆది, ఆనంద్, అలా మొదలైంది లాంటి సినిమాల్లో మనం కూడా ఈజీగానే నటించేయగలం అనుకునే చాలా మంది ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఏ సీన్‌కి ఆ సీన్‌లో కోపమో, బాధో, ఆనందమో మన మొహంలో కనిపించేలా చేస్తూ డైలాగులు అప్పచెప్పడమే యాక్టింగ్ అనుకుంటూ ఉంటారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు… ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తున్న నటుడి ఒరిజినల్ ఐడెంటిటీని ప్రేక్షకులు మర్చిపోవాలి. క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి. కమర్షియల్ సినిమాల విషయం పక్కన పెడితే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలలో ఇది మస్ట్‌గా జరగాలి. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్…అయితే ఆ స్థాయిలో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, లేకపోతే దర్శకత్వానికి మాత్రమై పరిమితమైతే బాగుంటుంది. సినిమా మాధ్యమం ద్వారా నాలుగు మంచి విషయాలు చెప్పాలని తపించే ఆర్పీ పట్నాయక్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలంటే ఈ రెంటిలో ఏదో ఒకటి జరగాలి. ఆర్పీపట్నాయక్ నుంచి ఇంకా మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటూ……

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close