రివ్యూ : విక్రమ్ వన్ మాన్ షో ‘ఇంకొక్కడు’

పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. ఏ పాత్ర చేసినా అందలో జీవించే ప్రయత్నం చేస్తుంటాడు.అపరిచితుడు చిత్రం లో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా, అన్యాయాన్ని ఎదిరించిన అపరిచితుడుగా మెప్పించిన విక్రమ్ అదే తరహాలో అలాంటి విలక్షణ మైన పాత్రలతో నటుడు విక్రమ్ మరోసారి తెలుగు లో `ఇంకొక్కడు`గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ లో ఇరుముగన్ పేరుతో, ఒకే రోజు విడుదల అయినా ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ దర్శకత్వం లో ఎన్.కె.ఆర్.ఫిలింస్ పతాకం పై నీలం కృష్ణా రెడ్డి తెలుగు లో విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగు లో ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ:

అఖిలన్ (విక్రమ్) ఇండియన్ ఇంటెలిజెన్సు రా ఏజెంట్, లవ్(విక్రమ్) ఎవ్వరికీ దొరకని ఒక హిజ్రా, సైంటిస్ట్, వీరి ఇద్దరి మధ్య జరిగే వార్ కధాంశమే ‘ఇంకొక్కడు’ విషయానికొస్తే…. నాలుగు ఏళ్ళ క్రితం అఖిలన్, తన కొల్లీగ్, అతనికి కాబోయే భార్యా మీరా (నాయన తార) ఇద్దరు కలసి కాశ్మీర్ లో జరిగిన ఓ ఆపరేషన్ లవ్ గ్యాంగ్ ని అంతమొందిస్తారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక ఇద్దరు అక్కడే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వెంటనే లవ్ గ్యాంగ్ మీరా ను చంపేస్తారు. లైవ్ లోకి వస్తే…. మలేసియా లో 70 ఏళ్ళ వయో వృద్ధుడు ‘స్పీడ్’ అనే రసాయనంతో తయారు చేసిన ఇంహేల్లెర్ పీల్చి, ఇండియన్ ఎంబసీ పై ఎటాక్ చేసి అక్కడున్న హై సెక్యూరిటీ వారందరిని చంపేస్తాడు. ఈ ఘటన పై ఇండియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇది ఎవరి పని అయ్యుంటుంది ఒకే ఒక్క వృద్ధుడు ఇంత మందిని ఎలా చంపగలిగాడు అని, ఇదివరకే సస్పెండ్ అయినా అఖిలన్ ను, మరో ఆఫీసర్ ఆరుషి (నిత్య మీనన్) ను మలేసియా కి పంపుతారు. మలేసియా లో ఏం జరిగింది? స్పీడ్ అనే డ్రగ్ ఎవరు కనిపెట్టారు? ఆధ్యంతం అక్కడ జరిగిన ఆపరేషన్ ఏంటి? దీనికి ఎవరు సహాయ పడతారు అన్నదే మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

ఈ సినిమాకి అన్నివిధాలా బలమైన పోల్ అంటే చియాన్ విక్రమ్ అనే నిస్సందేహంగా చెప్పేయొచ్చు. సరి కొత్త ప్రయోగాలకు విక్రమ్ ఎప్పుడూ ముందుటాడన్న విషయం ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసాడు. అఖిల్, లవ్ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ తన నటన స్థాయిని కొత్తగా మళ్ళీ పరిచయం చేశాడు. ముఖ్యంగా లవ్ పాత్రలో విక్రమ్‌ హిజ్రా పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. ఆ పాత్రకు కాస్యూమ్స్ పరంగా, మేకప్ పరంగా తీసుకున్న జాగ్రత్తలను అభినందించాల్సిందే! రెండు పాత్రలను అద్భుతం గా పోషించాడు విక్రమ్. మీరా పాత్రలో నయనతార ఎంత అందంగా కనిపించింది, నటన పరంగా ఆమె క్యారెక్టర్ ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా బాలన్స్ చేసింది. ఆరుషి పాత్రలో నిత్య మీనన్ తన పరిధి మేరకు నటించింది. ఇక మిగతా ఆర్టిస్ట్స్ ల గురించి చెప్పడానికి ఏమి లేదు.

సాంకేతిక వర్గం:

సాంకేతిక అంశాల పరంగా చూస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ హాలీవుడ్ లో ఇలాంటి కధాంశం తో చాలా సినిమాలు వచ్చిన విక్రమ్ వంటి నటుని తో అలాంటి కాన్సెప్ట్‌నే, కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే ఫస్టాఫ్ లో స్పీడ్ గా వున్నా సెకండాఫ్‌లో విల్లన్ అన్వేషణ కోసం జరిగిన సన్నివేశాలు కాస్త బోర్ కొట్టించాయి. స్పీడ్ డ్రగ్ గురించి చెప్పడం, అఖిల్, లవ్‌ల పాత్రలు పరిచయం చేయడం తదితర సన్నివేశాల్లో ఆనంద్ అద్భుతమైన ప్రతిభ చూపాడు. హరీష్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలంగా నిలిచింది. అయితే పాటలు తన గత చిత్రాల స్థాయిలో లేవు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

రా ఏజెంట్ గానే కాకుండా, లవ్ అనే హిజ్రా పాత్రలో విక్రమ్ నటన ప్రేక్షకులకు కనువిందు చేయడం ఈ సినిమా లో హై లెట్. ఫస్టాఫ్‌లో అఖిల్, లవ్, స్పీడ్ డ్రగ్.. ఇలా కథకు అవసరమైన పాత్రలను, అంశాలను పరిచయం చేసిన విధానం కట్టిపడేసేలా ఉంది. టైటిల్ కార్డ్స్ కూడా అసలు కథలోని అంశాన్ని అర్ధమయ్యే రీతిలో మోషన్ పోస్టర్ తో చెప్పడం బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్అదిరింది. అఖిల్, లవ్ పాత్రల మధ్యన సెకండాఫ్‌లో వచ్చే మైండ్ గేం కొన్ని చోట్ల ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ అంశాన్ని పక్కనబెడితే, ఇలాంటి కథతోనే హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చి ఉండడం తేలిపోయే విషయంగానే చెప్పొచ్చు. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్ ఒకసారి ఎదురుపడ్డాక సినిమా అంతా ఒకే ఒక్క అంశం చుట్టూ సాగేది కావడం బోర్ కొట్టించింది. మధ్యలో పాటలు రావడం కూడా కాస్త విసుగు తెప్పించింది. ఫస్టాఫ్‌లో విక్రమ్, నయనతారల మధ్యన వచ్చే లవ్‌ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. నిత్యా మీనన్ పాత్ర చాలా చిన్నది కావడంతో పాటు ఆమెకు పెద్దగా నటించే ఆస్కారం లేదు. తనకు బాగా అలవాటైన ఈ పద్ధతినే నమ్ముకొని విక్రమ్ ఈ సారి కూడా ప్రయోగాన్నే నమ్ముకొని మనముందుకు వచ్చాడు. అయితే ఆ ప్రయోగం పూర్తి స్థాయి సినిమాగా ఆకట్టుకోలేక పోయింది. చివరాఖరికి చెప్పేదేటంటే…ఇది విక్రమ్ సినిమా…గతం లో అయన చేసిన చిత్రాలతో పోల్చుకోకుండా చూస్తే ఓ కె….

తెలుగు360 .కామ్ రేటింగ్ 2.25/5

బ్యానర్: ఎన్.కె.ఆర్.ఫిలింస్, థమీన్స్ ఫిలిమ్స్,
నటి నటులు : చియాన్ విక్రమ్, నాయన తార, నిత్యామీనన్,నాజర్,తంబీ రామయ్య,బాల, కరుణ కరణ్, రుత్విక తది తరులు…
సినిమాటోగ్రఫీ :ఆర్ .డి . రాజ శేఖర్,
ఎడిటర్ : భువన్ శ్రీనివాసన్,
సంగీతం : హరీష్ జైరాజ్,
నిర్మాత : నీలం కృష్ణా రెడ్డి,శిబు థమీన్స్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆనంద్ శంకర్,
విడుదల తేదీ :ల 08.09.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close