బీజేపీ నేతలకు అఖిలేష్ రెడ్ సిగ్నల్ ! ఆమె కారణమా ?

బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ ఆఫీసుకు క్యూ కడుతూండటంతో అఖిలేష్‌కు కొత్త సమస్యలు వస్తున్నాయి. పార్టీ టిక్కెట్ల సర్దుబాటు .. ఇతర అంశాలను పక్కన పెడితే.. కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేయడంతో అఖిలేష్ ఒక్కసారిగా వెనుకడుగు వేశారు. ఇక బీజేపీ నేతల్ని చేర్చుకునే చేర్చుకోబోమని… కావాలంటే ఎస్పీ నేతల్ని కూడా చేర్చుకోవద్దని బహిరంగంగా ప్రకటించారు. దీనికి కారణం ఎస్పీ నుంచి ఎవరెవరో వెళ్లి బీజేపీలో చేరతారనే భయం కాదు. ఆయన తమ్ముడు భార్యనే వెళ్లి చేరుతారనే ఆందోళన.

అఖిలేష్‌కు సమాజ్ వాదీ పార్టీ విషయంలో మొదటి నుంచి కుటుంబసమస్యలు ఉన్నాయి. మొదట బాబాయ్ శివపాల్, తర్వాత అఖిలేశ్‌ సవతి సోదరుడైన ప్రతీక్‌ యాదవ్‌ కుటుంబం నుంచి ఇబ్బందులు ఉన్నాయి. శివపాల్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ అఖిలేష్‌తో పొత్తు పెట్టుకున్నారు. కానీ ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. రాజకీయంగా ఎంతో ఆసక్తి ఉన్న ఆమెకు ఎస్పీ టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేష్ నిరాకరించారు. కానీ ములాయం జోక్యంతో 2017ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్‌ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. కానీ ఓడిపోయారు.

ఆ తర్వాత ఎస్పీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఈ సారి టిక్కెట్ ఇస్తారో లేదో స్పష్టత లేదు. దీంతో ఆమె బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవల ఆమె బీజేపీని పొగుడుతున్నారు. దీంతో బీజేపీ ఆమెతో చర్చలు జరుపుతోదంి. తమ్ముడి భార్యను ఆపలేకపోతే… అఖిలేశ్‌ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి పోరు వల్ల సమస్యలు వస్తాయంటున్నారు. నిజానికి అపర్ణా సొంత తమ్ముడి భార్య కాదు. ములాయంసింగ్‌ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్‌ యాదవ్‌. ఆయన భార్య అపర్ణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close