ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం వెళ్లి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొని వెంటనే మళ్లీ అమరావతికి తిరిగి వస్తారు. ఇంత హడావుడిగా అమిత్ షాతో సమావేశం ఎందుకనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యవసరమైన రాజకీయపరమైన చర్చల కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారని కొంత మంది భావిస్తున్నారు.
అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున ఏపీకి అత్యవసరమైన ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్తున్నారని చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలకు.. అమిత్ షాకు సంబంధం లేదు అయితే.. కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా అమిత్ చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ఆయన చెబితే పనులు జరుగుతాయి. అందుకే చంద్రబాబు ఆయన వద్ద నుంచే ఏపీ ప్రతిపాదనలు పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఏపీలో కొంత మంది నిద్ర లేకుండా చేస్తూంటాయి. ఏ చర్చిస్తారో.. ఎలాంటి విషయాలు చర్చిస్తారో.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని కంగారు పడుతూ ఉంటారు. రాజకీయ నేతలు అంతర్గత చర్చల్లో చాలా విషయాలు మాట్లాడుకుంటారు కానీ బయటకు చెప్పేది మాత్రం.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించామనే.
