హవాలాతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌కి సంబంధం ఏంటి?

విజయవాడలో బ్రహ్మాజీరావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కొట్టారన్న విషయం కూడా స్పష్టమవుతోంది. కిడ్నాప్ చేసినవాళ్ళు వదిలేశాక ఆ వ్యక్తి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్‌లో ఆ వ్యక్తిని ఇంటర్యూ చేసిన మీడియాతో ఆ బ్రహ్మాజీరావు షాకింగ్ విషయాలు చెప్పాడు. డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, చల్లపాటి రవిలు కొంతమంది రౌడీలతో వచ్చి తనను కిడ్నాప్ చేశారని, వారం రోజుల పాటు హింసించి ఆ తర్వాత వదిలేశారని చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ రావు. తనను కొట్టి తన ఒంటి మీద ఉన్న నగలు దోచుకున్నారని చెప్పాడు. అలాగే పిల్లలు లేని నీకు ఆస్తులు ఎందుకు అని పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం ఇష్యూలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కూడా ఉన్నాడని బ్రహ్మాజీరావు చెప్పుకొచ్చాడు. వాళ్ళ మధ్య గొడవలేంటి? హవాలా కుంభకోణం ఆనుపానులేంటి అనే విషయం పక్కన పెడితే ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్‌కి వాళ్ళతో ఏం సంబంధం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

జర్నలిస్టులు రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చడం మన దగ్గర ఎప్పుడో స్టార్ట్ అయింది. కొన్ని సంస్థలను మేనేజ్‌మెంట్ స్థాయి వ్యక్తులే బెదిరించడాన్ని చూశాం. అలాగే సినిమావాళ్ళను కూడా మీడియా వాళ్ళు మామూలుగా బ్లాక్ మెయిల్ చెయ్యరు. డబ్బులివ్వలేదని కక్ష్య కట్టి మరీ దారుణమైన రివ్యూలు రాయడం, అలాగే సినిమా వాళ్ళ పర్సనల్ వీడియోలు, తప్పుులు బయటపడితే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడాన్ని కూడా చూశాం. అయితే ఇవన్నీ బయటకు రావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా సంస్థల్లో అధికారికంగా లాభాల్లో ఉన్న సంస్థలు ఎన్ని అంటే వేళ్ళమీద లెక్కపెట్టేటన్ని కూడా లేవు. అయినప్పటికీ రోజు రోజుకూ మీడియా సంస్థలలోకి వచ్చే కోటీశ్వరులు, నాయకుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాళ్ళందరూ కూడా అధికారికంగా ఏవో లాభాలు వస్తాయన్న ఉద్ధేశ్యంతో అయితే కచ్చితంగా రావడం లేదని చెప్పొచ్చు.

రాజకీయంగా లాభపడదామన్న ఉద్ధేశ్యం, అలాగే ఇతర వ్యాపారాల్లో తాము చేసే స్కాముల విషయంలో విచారణ జరగకుండా ఉండాలంటే మీడియా అండ ఉండాలని ఓ మీడియా మొఘల్ ససాక్ష్యంగా చెప్పిన మెస్సేజ్‌తోనే వస్తున్నారు. ఆ మధ్య వైకాపా నుంచి బహిష్కరించబడిన రఘురామకృష్ణంరాజుకు ఆ విషయాన్ని ఓ సాక్షి జర్నలిస్ట్ చెప్పాడు. వైకాపా పార్టీకి ఆ సాక్షి జర్నలిస్ట్‌కి ఏం సంబంధం? ఇక ఎన్నికల సమయంలో మీడియా వాహనాల్లో డబ్బు తరలించడంపైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలుగునాట ఈ మీడియా దందా ఏంటి? ఇప్పుడు బ్రహ్మాజీరావు ఎంత పెద్ద విలన్ అని కూడా ఆంధ్రజ్యోతిలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. కానీ బహ్మాజీరావు నోట ఆంధ్రజ్యోతి విలేఖరి పేరు వినిపించింది అని మాత్రం చెప్పరు. అలాంటప్పుడు మీడియాలో వచ్చే వార్తలను ఎలా నమ్మాలి? అన్ని క్రైమ్స్‌లోనూ భాగాలు పంచుకుంటూ క్రైమ్ బయటపడగానే మేమంతా పత్తిత్తులం అని చెప్పి సందేశాలు ఇవ్వడానికి బయల్దేరితే ఎవరు నమ్ముతారు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.