లేడీ ఓరియెంటెడ్ క‌థ‌తో… అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు అనిల్ రావిపూడి. వ‌రుస‌గా నాలుగు హిట్లు. అందులో నాలుగో హిట్టు బ్లాకు బ్ల‌స్ట‌రు. దిల్ రాజు కెరీర్‌లోనే ఇన్ని లాభాలు ఎప్పుడూ చూడ‌లేద‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అలాంటి హిట్టిచ్చాడు మ‌రి. అలాంట‌ప్పుడు మోస్ట్ వాంటెడ్ కాకుండా ఎలా ఉంటాడు? టాప్ హీరోలు సైతం అనిల్ రావిపూడి మంచి క‌థ చెబుతాడేమో చేద్దాం అన్న‌ట్టు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ ద‌శ‌లో అనిల్ క‌న్ను లేడీ ఓరియెంటెడ్ సినిమాపై ప‌డింది.

అవును…. అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఉంద‌ట‌. దాన్ని ప‌ట్టాలెక్కిద్దామ‌ని భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ అంటే.. హార్ర‌ర్లూ, థ్రిల్ల‌ర్లు అనుకుంటారు. కానీ ఈ క‌థ ఆ టైపు కాద‌ట‌. ఇదో మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని, ఓ హీరోని తెర‌పై ఎలా చూడాల‌నుకుంటామో, అలా ఓ హీరోయిన్‌ని చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తొంది. `ఎఫ్ 2` త‌ర‌వాత అనిల్ చేయ‌బోయే సినిమా అదో కాదో స్ప‌ష్టంగా తెలీదు గానీ, అతి త్వ‌ర‌లోనే త‌నో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయ‌డం ఖాయం. ఇలాంటి క‌థ‌లంటే గుర్తొచ్చేది అనుష్క‌, స‌మంత‌లే. అనిల్ కూడా వీరిద్ద‌రినే దృష్టిలో ఉంచుకున్నాడా? లేదంటే… మ‌రో క‌థానాయిక వైపు చూస్తాడా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close