ర‌జ‌నీకాంత్‌కి అల్లుడి మ్యూజిక్

సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కి తమిళ హీరో ధనుష్ అల్లుడని తెలుగు ప్రేక్షకుల్లో కూడా చాలామందికి తెలుసు. ధనుష్ కాకుండా సినిమా ఇండస్ట్రీలో రజనీకి ఇంకొక అల్లుడున్నాడు. అతడే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్. ఎలా? అనుకుంటుంన్నారా! అనిరుధ్ తండ్రి రజనీకాంత్ వైఫ్ లతకి బ్రదర్. ఆ లెక్కన ఈ యువ సంగీత దర్శకుడికి రజనీకాంత్ మావయ్య అవుతాడు. ధనుష్ బ్రదర్ అవుతాడు. ఇప్పుడు అర్థమయిందా? ధనుష్ సినిమాలకు అనిరుధ్ ఎందుకంత ఇరగదీసి మ్యూజిక్ కొడతాడో! తమిళంలో ఎన్ని హిట్స్ ఆల్బమ్స్ ఇచ్చిన ఇప్పటివరకూ మావయ్య సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ అతడికి రాలేదు. ఇప్పుడు వచ్చింది.

రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. ఇక, రజనీకాంత్ సినిమాలు మానేస్తాడేమో అనుకుంటున్న సమయంలో అందరికీ షాక్ ఇస్తూ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించే సినిమా అంగీకరించాడు సూప‌ర్‌స్టార్‌. ఆ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. మావయ్య ఇమేజ్, స్టార్ స్టేటస్ అల్లుడికి బాగా తెలుసు. అందువల్ల, అతడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడోనని తలైవా ఫాన్స్ అండ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.