జ్యోతిష్యం, హోమియోపతిపై ఎందుకంత కసి?

విశ్లేషణ:

తెల్లవారగానే మనలో చాలామంది రాశిఫలాలు చూసుకుంటారు. ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా జ్యోతిష పండితుల దగ్గరకు పరిగెత్తుతుంటాము. భారతీయ జ్యోతిష శాస్త్ర ఆధారంగా దేశంలో వేలకోట్ల రూపాయల బిజినెస్ సాగిపోతున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే, పెద్దగా పెట్టుబడిలేని బడా వ్యాపారంగా మారిపోయింది. కోట్లాది మంది విశ్వసిస్తున్న జ్యోతిష్యం పెద్ద బోగస్ అని అంటే మనలో చాలామందికి మనసు చివుక్కుమంటుంది. కానీ ఒక శాస్త్రవేత్త ఆమాట అనేశారు. ఒక్క జ్యోతిషం గురించేకాదు, చాలా చవకగా దొరికే హోమియోపతి వైద్యాన్ని కూడా సదరు శాస్త్రవేత్త దుమ్మెత్తిపోశారు. హోమియోపతి విధానం ఆధునిక శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నదనీ, తగిన ఆధారాలు లభించడంలేదన్నది ఆయనగారి వాదన. ఇటు జ్యోతిష్యాన్ని, అటు హోమియోపతిని బోగస్ గాడికికట్టేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఆ పూర్వాపరాలను ఓసారి అవలోకిద్దాం.

జ్యోతిషశాస్త్రానికి విలువలేదా? హోమియోపతి వైద్యం హానికరమా? ఈ రెండు ప్రశ్నలకు రసాయనశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న వెంకటరామన్ రామకృష్ణన్ అవుననే వాదిస్తున్నారు. ఆయన వాదనలో ఓ కసి కనబడుతోంది. ఈ రెండూ నిజమైన సైన్స్ కు ఆమడదూరంలో ఉన్నాయని అంటున్నారు. డాక్టర్ రామకృష్ణన్ చెప్పిందేమిటంటే…

1. హోమియోపతి, జ్యోతిష శాస్త్రం – ఈ రెండూ పనికొచ్చేవి కానేకావు. బోగస్ ఫీల్డ్స్ కంటే నిజమైన సైన్స్ చాలా వేగంగా, మరింత ఆసక్తిగా ముందుకు సాగిపోతున్నది.

2. విజ్ఞానశాస్త్రపు అవగాహన పెంచుకోవాలని మన రాజ్యాంగంలో ఉన్నది. ఈ పరిస్థితి మరే దేశంలోనూ లేదు. ఈ స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించినప్పుడు దాన్ని హేతువాద దృష్టితో పెంపొందించుకోవాలి.

3. అంతరిక్షంలో సంచరించే గ్రహనక్షత్రాదులకూ మానవ జీవన గమనానికీ సంబంధం ఉన్నట్లు ఇంతవరకు శాస్త్రీయమైన ఆధారాలు లభించలేదు. గ్రహరాశులు వల్ల మన అదృష్ట, దురదృష్టాలు ఆధారపడి ఉండవని మోడ్రన్ సైన్స్ చెబుతున్నది.

4. మనం ఎక్కడ, ఎప్పుడు పుట్టామన్న అంశాలు మన జీవితంలో ప్రభావితం చూపుతాయన్నదానికి కూడా సరైన ఆధారులు చూపలేకపోతున్నారు.

5. మనదేశంలో ప్రాచీనకాలంలో ఏర్పడిన శాస్త్రమే జ్యోతిషం. ఆనాడు రూపొందించిన సిద్ధాంతాలు మోడ్రన్ సైన్స్ రావడంతో మరుగునపడిపోయాయి. జ్యోతిష పండితులు చెబుతున్న ఫలితాలు ఫలించవచ్చు, లేదా వికటించనూ వచ్చు. యాదృచ్ఛికంగా జరిగేవాటిని శాస్త్రంతో ముడిపెడుతుంటారు. ప్రజల్లో నమ్మకాలు పాతుకుపోయినప్పుడు వాటిని కూకటివ్రేళ్లతో పెకిలించడం కష్టమే. హేతువాదబద్ధంగా, శాస్త్రీయంగా సాగుతున్న ఆలోచనల వల్ల సమాజానికి ఏనాడూ చెరుపురాదు. కానీ మూఢనమ్మకాల ఆధారంగా పెరుగుతున్న సంస్కృతి వల్లనే విపత్కర పరిస్థితులు వాటిల్లుతుంటాయి.

6. హోమియోపతి మనదేశంలో పుట్టిందని అనడానికి ఆధారాలు లేవు. ఈ వైద్య విధానం జర్మన్ లో ఆవిర్భవించినట్లు స్పష్టంగా తేలింది. వీళ్లు (హోమియోపతి వైద్యులు) ఆర్సెనిక్ కాంపౌండ్స్ ను ఎంతగా డైల్యూట్ చేస్తారంటే, అందులో కేవలం ఒకే ఒక్క మాలిక్యూల్ ఉండేటంతవరకు. ఆ ఒక్క మాలిక్యూల్ (అణువు) మన శరీరంపై ప్రభావం చూపించి వ్యాధిని తగ్గిస్తుందని అనడంలో హేతుబద్దత కనిపించదు. ఇంతగా డైల్యూట్ అయ్యాక ఆ మందుకంటే, పంపులో నీళ్లు ఎక్కువ ఆర్సెనిక్ గా ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు.

7. రసాయనశాస్త్రంలో పట్టుఉన్న ఎవ్వరూ ఈ హోమియోపతి విధానాన్ని అంగీకరించలేరు. ఇది రోగం మీద ప్రభావం చూపదు. కేవలం రోగి మనసుమీద మాత్రమే ప్రభావితమవుతుంది. మాత్రలు వేసుకోవడం వల్లనే రోగం తగ్గిందన్న అభిప్రాయం మనసుపై ముద్రపడుతుంది. సైకలాజికల్ బెనిఫిట్ కోసం మాత్రమే ఇలాంటి మందులను ప్రిస్కైబ్ చేస్తుంటారు. ఇది సంపూర్ణ వైద్య విధానం కానేకాదు.

8. పూర్వం `రసవాదం’ అని ఒకటి ప్రచారంలో ఉండేది. ఇది ఆరోజుల్లో రసాయనశాస్త్రంలో ఒక భాగం. ఈ రసవాదంతో ఇనుమును బంగారంగా మార్చవచ్చని అనుకునేవారు. ఇది కేవలం నమ్మకం. అయినప్పటికీ ఈ ప్రయోగాల వల్ల ఎంతో సమాచారం ప్రోగైంది. ఈ డేటా ఆధునిక రసాయనిక శాస్త్రంలో మూలకాల ధర్మాలను విశ్లేషించడానికి ఎంతోకొంత సహాయపడింది. అయితే, పురాతన జ్యోతిష శాస్త్రం ఎక్కడవేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయింది. ఈలోగా గ్రహ, అంతరిక్ష శాస్త్రం శరవేగంగా దూసుకుపోయింది. కృష్ణబిలం, నక్షత్రాల పుట్టుక, గిట్టుక దాకా శాస్త్రం ఎదిగింది.

9. మనిషి తనలోని మూఢనమ్మకాలను పక్కనబెట్టి చూస్తే నిజమైన సైన్స్ ఎంతగా ఉపయోగపడుతున్నదో అర్థం అవుతుంది. శాస్త్రవేత్తలు కూడా మానవులే. కాకపోతే వారు ఇగోలను పక్కనబెట్టి ఆలోచిస్తుంటారు. వారు మూఢనమ్మకాలకు తావివ్వరు. అయితే, శాస్త్రవేత్తలమని చెప్పుకునే కొందరు మూఢనమ్మకాలకు తమ ఆధునిక ఆలోచనలను ముడిపెడుతున్నారు. దీని వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నది. ఒకరొచ్చి విమానాన్ని ప్రాచీన కాలంలోనే మనదేశంలో కనుగొన్నారని అడ్డంగా వాదిస్తుంటాడు. కానీ కచ్చితమైన డేటా అతని దగ్గర ఉండదు. సైన్స్ ఎప్పుడూ డేటామీద ఆధారపడి ఉంటుంది.

10. ఆధునిక శాస్త్రవిజ్ఞానం కారణంగానే గడచిన వందేళ్లలో మానవ జీవనం సుఖమయమైంది. మహమ్మారి వంటి వ్యాధులను ఎదుర్కోగలిగాము. శరీర ధర్మశాస్త్రానికీ, జీవ రసాయన శాస్త్రానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాలను సరైన రీతిలో గుర్తించగలిగాము. దీంతో ఎక్కువ కాలం సుఖంగా జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరహా జీవనాన్ని మూఢనమ్మకాలతో కూడిన శాస్త్రాలు ఇవ్వలేకపోయాయి.

గాంధీ మాటల్లో హోమియో

అయితే రామకృష్ణన్ వాదనలు ముఖ్యంగా హోమియోపతిపై చేసిన వాఖ్యలు మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉండటం గమనార్హం. పూజ్య బాపూజీ హోమియోపతిని సంపూర్ణమైన వైద్య విధానంగానే గుర్తించారు. మిగతా వైద్యంలో కంటే ఎక్కువ శాతం కేసులను హోమియో నయం చేయగలిగిందని భావించారు. మనదేశ ప్రజలకు అతి తక్కువ ధరకు లభించే వైద్య విధానం ఇదేనంటూ ఆయన కొనియాడారు.

హోమియోపతి వైద్యం హానికరమంటూ రామకృష్ణన్ వాదించారు. అయితే, ఒక పక్క ఎలాంటి ప్రభావం చూపదని అంటూనే మరోపక్క హానికరమంటూ తేల్చిచెప్పడం చర్చనీయాంశమైంది. ఇటు హోమియో, అటు జ్యోతిషం – ఈ రెండూ కష్టాల్లో ఉన్న మనిషికి కొండంత ధైర్యాన్ని అందిస్తున్నాయనీ, వీటిపై ప్రజలకున్న నమ్మకాలపై గేమ్స్ ఆడటం మంచిదికాదని జ్యోతిష శాస్త్ర పండితులు అంటున్నారు.

హోమియోపతి, జ్యోతిష శాస్త్రం వంటివి బోగస్ అంటూ కొట్టిపారేసిన రామకృష్ణన్ అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా ? మీ అభిప్రాయాలను తెలియజేయండి. దీనిపై సమగ్రంగా చర్చించుకుందాం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close