గూగుల్ సీఈవో గా బాలయ్య‌?

నంద‌మూరి బాల‌కృష్ణ అంటే.. మాస్ త‌ర‌హా పాత్ర‌లే గుర్తొస్తాయి. ఫ్యాక్ష‌న్ క‌థ‌లు ఆయ‌న‌కు సూటైన‌ట్టు ఇంకెవ్వ‌రికీ అవ్వ‌వు. అందుకే ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు బాల‌య్య కేరాఫ్ అడ్ర‌స్స్ అయ్యారు. అయితే బాల‌య్య ట‌క్‌, టై క‌ట్టుకుని, కార్పొరేట్ ఆఫీసులో ప‌నిచేస్తుంటే ఎలా ఉంటుంది? కొత్త‌గా అనిపిస్తుంది క‌దా. ఈ ఆలోచ‌న శ్రీ‌వాస్ కి వ‌చ్చింది. అందుకే బాల‌య్య‌ని గూగుల్ సీఈవోగా మారుస్తున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ‌- శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో ఇది వ‌ర‌కు `డిక్టేట‌ర్‌` సినిమా వ‌చ్చింది. ఇప్పుడు ఈ కాంబో మ‌రోసారి సెట్ట‌య్యే సూచ‌న‌లు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా బాల‌య్య కోసం క‌థ‌లు సిద్ధం చేసే ప‌నిలో ఉన్నారు శ్రీ‌వాస్‌. కార్పొరేట్ రాజ‌కీయాల నేప‌థ్యంలో… శ్రీ‌వాస్ ఓ క‌థ రాశారు. అది బాల‌య్య‌కు స‌రిపోతుంద‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. ఓ చిన్న ఊరు నుంచి గూగుల్ లాంటి కంపెనీకి సీఈవోగా ఎదిగిన ఓ వ్య‌క్తి క‌థ ఇది. మ‌ళ్లీ త‌న ఊరికి, త‌న దేశానికి… త‌ను సంపాదించిన జ్ఞానాన్నీ, సంపాద‌న‌నీ పంచివ్వాల‌నుకుంటే ఏమ‌వుతుంది? అనేది క‌థ‌. శ్రీ‌మంతుడు, మ‌హ‌ర్షి ఫ్లేవ‌ర్ లో ఈ క‌థ సాగ‌బోతోంద‌ని, ఓ సామాజిక అంశాన్ని ఈ క‌థ‌తో బ‌లంగా చెప్పాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈచిత్రానికి సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం అఖండ‌తో బిజీగా ఉన్నారు బాల‌య్య‌. ఆ త‌ర‌వాత‌.. గోపీచంద్ మ‌లినేని సినిమా ప‌ట్టాలెక్కుతుంది. మ‌రోవైపు అనిల్ రావిపూడి కూడా బాల‌య్య కోసం క‌థ త‌యారు చేస్తున్నాడు. ఆ త‌ర‌వాతే… శ్రీ‌వాస్ సినిమా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close