కాంగ్రెస్ ని దెబ్బ తీయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భాజపా

ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా జరుగవచ్చు. వాటి కోసం కాంగ్రెస్, భాజపాలు అప్పుడే తగిన వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నాయి. ఆ రెండు పార్టీలకి కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి కావడంతో ఆ రాష్ట్రంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని నిలబెట్టే అవకాశం ఉందని తెలిసిన వెంటనే ఆమెపై నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణం కేసులో ఎసిబి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. ఈ రోజు ఆమెకు సమన్లు కూడా జారీ చేసింది. దానితో ఆమెని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకాడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కూడా కొందరు అదే కారణంతో ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే భాజపా (మోడీ ప్రభుత్వం) వ్యూహం బాగానే పనిచేసిందని భావించవలసి ఉంటుంది.

యూపి ఎన్నికల ప్రచార బాధ్యతలని ఈసారి ప్రియంకా వాద్రాకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు మీడియాలో చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఏనాడూ వాటిని ఖండించలేదు. అంటే ఆ వార్తలు నిజమేనని భావించవచ్చు. ఈ విషయంలో కూడా భాజపా చాలా తెలివిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. భాజపా నేత దినేష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “యూపి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు సారధ్యం వహిస్తారనే దానితో మాకు తేడా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి ఎవరు సారధ్యం వహించినా ఎన్నికలలో గెలవలేదు. ఇప్పటికే యూపిలో ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. వచ్చే ఎన్నికలలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం,” అని అన్నారు.
ప్రియాంకా వాద్రా నాయకత్వం వహించడం గురించి వచ్చిన వార్తలపై స్పందిస్తూ, “మొదట సోనియాజీ నాయకత్వమన్నారు. ఆ తరువాత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారన్నారు. ఇప్పుడు ప్రియాంకా వాద్రా నాయకత్వం వహిస్తారని చెపుతున్నారు. అంటే సోనియా నాయకత్వంపై నమ్మకం లేకనే రాహుల్ గాంధీని, మళ్ళీ ఆయనపై నమ్మకం లేకనే ఇప్పుడు ప్రియాంకా వాద్రాని తీసుకువస్తున్నట్లున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా షీలా దీక్షిత్ ని బరిలో దింపుతామని చెపుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా దానిని ఎవరూ కాపాడలేరు. ఒకప్పుడు జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. మున్ముందు ఇంకా దిగజారినా ఆశ్చర్యం లేదు,” అని అన్నారు.
యూపిలో చాలా మంది భాజపా నేతలు ఇదే విధంగా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బహుశః అందుకేనేమో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఈ ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాకి ఇటువంటి వార్తలు ఎవరు అందిస్తారో..అవి ఎలాగ ఎక్కడ నుంచి పుట్టుకు వస్తాయో అర్ధం కావడం లేదు. ప్రియాంక వాద్రాకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించాలని మేము ఆలోచనే చేయలేదు. ఇదివరకు చాలాసార్లు ఆమె ఎన్నికలలో ప్రచారం చేశారు. యూపి ఎన్నికలలో కూడా ఆమె పార్టీ కోసం ప్రచారం చేస్తే చేయవచ్చు. అలాగే షీలా దీక్షిత్ అభ్యర్ధిత్వంపై కూడా మేము ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు,” అని అన్నారు.
అంటే ప్రియాంకా వాద్రా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. మీడియాలో ఏవేవో వార్తలు రావడం, వాటిపై భాజపా నేతలు ఏవో విమర్శలు చేస్తుడటం గమనిస్తే, భాజపా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని అడ్డుకొంటోందని అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీయే తమ అభ్యర్ధి గురించి, ప్రియాంకా వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగించడం గురించి మీడియాకి లీకులు ఇచ్చింది. దానిని భాజపా చక్కగా ఉపయోగించుకొని అడ్డుపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close