షర్మిల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు!

ఆంధ‌ప్ర‌దేశ్ పోలీసుల‌పై న‌మ్మ‌కం లేదంటూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల కూడా తాజాగా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో త‌న‌పై జరుగుతున్న విష ప్రచారంపై ఆమె హైద‌రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడి క‌త్తి దాడి సంద‌ర్బంగా జ‌గ‌న్ కూడా ఇలానే ఆంధ్రా పోలీసుల‌పై న‌మ్మ‌కం లేద‌ని వ్యాఖ్యానించారు. ఆ కేసు విచార‌ణ‌లో భాగంగా ఆంధ్రా పోలీసులు వ‌స్తే సహ‌క‌రించ‌లేదు. ఇదే అంశ‌మై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. విలేక‌రుల స‌మావేశంలో ఓప్ర‌శ్న‌కు స‌మాధానంగా జ‌గ‌న్‌, ష‌ర్మిల‌పై ఫైర్ అయ్యారు.

ఈ రాష్ట్ర పోలీసుల‌పై న‌మ్మకం లేద‌ని అంటున్న‌ప్పుడు, వారు ఈ రాష్ట్ర పౌరులు ఎలా అవుతారంటూ సీఎం నిల‌దీశారు. ఇండియాలో ఉండేవాళ్లు ఈ దేశంపై న‌మ్మ‌కం లేదు, వేరే దేశంలో ద‌ర్యాప్తు చేయ‌మ‌ని వెళ్తే ఎలా ఉంటుందన్నారు. క‌ష్టం ఉన్న‌ప్పుడు చెప్పుకోవాల‌నీ, అంతేగానీ ఈ దేశంలో ఉంటూ పోలీసు వ్య‌వ‌స్థ‌పైనే న‌మ్మ‌కం లేద‌ని, ఫిర్యాదు చెయ్య‌ను అన‌డం బాధ్య‌తా రాహిత్యం కాదా అని ప్ర‌శ్నించారు. ఈ స‌మాజంలో బాధ్య‌తాయుతంగా లేన‌ప్పుడు, ఇక్క‌డి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీ చేస్తున్న‌ట్టు అన్నారు. హైదరాబాద్ లో కాపురం ఉంటూ, అక్క‌డ కూర్చుని ఆంధ్రా పోలీసుల‌పై నమ్మ‌కం లేదంటే ఏమ‌నాలంటూ ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు అన్నారు. బెంగ‌ళూరులో ఉండేవారు బెంగ‌ళూరులోనే కంప్ల‌యింట్ ఇస్తార‌నీ, చెన్నైలో ఉన్న‌వారు చెన్నైలో ఇస్తార‌నీ, అలాగే హైద‌రాబాద్ లో ఉన్న‌వారు అక్క‌డేదైనా జ‌రిగితే అక్క‌డే క‌దా ఫిర్యాదు చేయాల్సిందన్నారు. హైద‌రాబాద్ లో ఉండి ఆంధ్రా పోలీసు వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం లేదంటే… ఎక్క‌డికి పోతున్న‌ట్టు మీరు అని ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ పై కోడి క‌త్తి దాడి కేసును ఉద్దేశించి మాట్లాడుతూ… సంఘ‌ట‌న విశాఖ‌లో జ‌రిగితే ఇక్క‌డ ఫిర్యాదు చేయ‌డం మానేసి, ఇప్పుడు ఎన్‌.ఐ.ఎ. ద‌ర్యాప్తు కావాలంటున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. దానికి కేంద్రం కూడా అత్యుత్సాహంతో స్పందించ‌డం చూస్తున్నామ‌న్నారు. ఇదే కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కి ఎవ‌రైనా వెళ్లి, మేం అంత‌ర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తాం, అమెరికా ప్ర‌భుత్వానికి ఇస్తాం అంటే ఒప్పుకుంటారా అని ప్ర‌శ్నించారు. ఇండియాలో జ‌రిగిన క్రైమ్ కి వేరే దేశంలో ద‌ర్యాప్తుకి ఇస్తారా ఎక్క‌డైనా అన్నారు. ఈ రాష్ట్ర పౌరుడిగా ఉన్న‌ప్పుడు ఆద‌ర్శ‌వంతంగా ఉండాల‌న్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close