ఛార్మి స‌మాధానాలు : ఏమో.. తెలీదు.. గుర్తు లేదు

అదుర్స్ సినిమా గుర్తింది క‌దా?? అందులో చారి.. ఏ ప్ర‌శ్న అడిగినా – ఏమో తెలీదు గుర్తులేదు – అంటూ విల‌న్‌ని విసిగిస్తుంటాడు. స‌రిగ్గా ఛార్మి కూడా సిట్ అధికారుల ముందు ఇలాంటి స‌మాధానాలే చెప్పింద‌ట‌. బుధ‌వారం సిట్ విచార‌ణ‌కు ఛార్మి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. దాదాపు 6 గంట‌ల పాటు సాగిన ఈ విచార‌ణ‌లో ఛార్మి నుంచి సిట్ అధికారులు అద‌న‌పు స‌మాధానాలేం రాబ‌ట్ట‌లేద‌ని తెలుస్తోంది. ఏ ప్ర‌శ్న అడిగినా.. తెలీదు అనే స‌మాధాన‌మే ఎక్కువ‌గా చెప్పింద‌ని, కెల్విన్‌తో సంబంధాల గురించి ఏమాత్రం నోరు విప్ప‌లేద‌ని స‌మాచారం. కెల్విన్ తో దిగిన ఫొటోలు చూపించినా స‌రే… ‘ఏమో ఈ ఫొటోలు ఎప్పుడు దిగానో గుర్తులేదు. అభిమానులు సెల్ఫీలు అడ‌గ‌డం కామ‌నే. అలాంట‌ప్పుడు ఎంత‌మందిని గుర్తించుకొంటా’ అంటూ క‌ప్ప‌దాటు స‌మాధానాల‌తో విసిగించింద‌ని తెలుస్తోంది. అంతేకాదు… ఛార్మి – కెల్విన్‌ల మ‌ధ్య జ‌రిగిన వాట్స‌ప్ చాటింగ్ విష‌యంలోనూ ఛార్మి ఇలాంటి స‌మాధానాలే చెప్పింద‌ట‌. అందులో ఉన్న కోడ్ భాష ఏమిట‌న్న‌ది సిట్ అధికారులు గుర్తించినా, అదేదో చార్మి నోటి నుంచి వినాల‌ని ఆశ ప‌డ్డారు. కానీ స్క్రిప్టు ముందే ప్రిపేర్ అయి వ‌చ్చిన ఛార్మి.. ఏ విష‌యంలోనూ అంత‌గా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. కాక‌పోతే డ్రగ్స్ కేసులో ఛార్మి ప్ర‌మేయం ఏమిట‌న్న విష‌యంపై సిట్ అధికారులు ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని, కేవ‌లం క్రాస్ చెక్ చేసుకోవ‌డానికే ఛార్మిని విచార‌ణ‌కు పిలిచార‌ని తెలుస్తోంది. ఛార్మిని మ‌రోసారి విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశాలు ఉన్నా, సిట్ అధికారులు అందుకు ఉత్సాహం చూపించ‌డం లేద‌ని, ఛార్మి విష‌యంలో ఇప్ప‌టికే క్లియ‌ర్ క‌ట్ గా ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.