భాజపా ఆంధ్ర గురించి..జగన్ తెలంగాణా గురించి మాట్లాడరా?

తెరాస పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొన్న ఖమ్మంలో చాలా అట్టహాసంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంది. రాజకీయ పార్టీలన్నీ ఆవిధంగా ప్రతీ ఏటా ప్లీనరీలు నిర్వహించుకోవడం సాధారణ విషయమే. తెరాస అధికారంలో ఉంది కనుక మరింత అట్టహాసంగా నిర్వహించుకొంది. అధికార పార్టీ ప్లీనరీలను ప్రతిపక్షాలు తప్పు పట్టడం కూడా చాలా సహజమే కనుక, తెలంగాణాలో ప్రతిపక్షాలు ఆ బాధ్యతను పూర్తి చేసాయి. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ కూడా దానిపై విమర్శలు గుప్పించారు.

ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను వెంటబెట్టుకొని మొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మని కలిసి ప్రభుత్వం తక్షణమే కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతుంటే, ప్రభుత్వం యుద్దప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టకుండా అట్టహాసంగా ప్లీనరీ వేడుకలు జరుపుకొంది. కరువు సమస్యని పట్టించుకోకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడం గురించే నిరంతరం ఆలోచిస్తోంది. మా పార్టీ తరపున 10 బృందాలు రాష్ట్రమంతటా పర్యటించి కరువు పరిస్థితులను, దాని వలన ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి తక్షణమే సహాయ కార్యక్రమాలు చేయాలని కోరుదామని గత మూడు వారాలుగా తిరుగుతున్నా ఆయన అపాయింట్ మెంట్ మాకు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చి వస్తున్నాము. కనీసం ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సహాయ చర్యలు చేపట్టకపోయినట్లయితే, దీని కోసం వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఉద్యమిస్తుంది,” అని డా. లక్ష్మణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన తన బాధ్యతను సక్రమంగానే నెరవెర్చారని భావించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి కరువు పరిస్థితులే నెలకొని ఉన్నాయి. దానిపై కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి కానీ తెదేపా మిత్రపక్షం కావడంతో రాష్ట్ర భాజపా నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి తెరాస, తెలంగాణా సమస్యల గురించి మాట్లాడనట్లే భాజపా నేతలు ఆంధ్రా సమస్యల గురించి మాట్లాడరని సరిపెట్టుకోవాలేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close