ఎడిటర్స్ కామెంట్ : # రిజైన్ మోడీ..!

నాయకులకి ఉండాల్సిన లక్షణాలేమిటి..? దేశాన్ని నడిపించే నేతలకు ఉండాల్సిన ముందు చూపేమిటి..? ప్రజలను కాపాడాల్సిన పాలకులకు ఉండాల్సిన పట్టుదల ఏమిటి..?. ఖచ్చితంగా దాహమేసినప్పుడు… బావి తవ్వుకుందామనుకునేంత గొప్ప ఆలోచనా పరులు మాత్రం నేతలు.. పాలకులు కాకూడదు. అలా అయితే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న దారుణమైన దుస్థితే కనిపిస్తోంది. వ్యాక్సిన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించిన శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి ఇంటర్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన చాలా సూటిగా.. స్పష్టంగా.. సుత్తి లేకుండా.. అసలు ఇండియాలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో చెప్పారు. అదేమీ రాకెట్ సైన్స్ కాదు. ఆయన శాస్త్రవేత్త కాబట్టి జన్యువుల పరిణామ క్రమాన్ని విశ్లేషించి చెప్పలేదు. కేవలం ఆయన కామన్‌సెన్స్ ద్వారా మాత్రమే తప్పెక్కడ జరిగిందో విశ్లేషించారు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు.

దాహమేసినప్పుడు బావి తవ్వుకోవడం నాయకత్వ లక్షణమా…!?

ముందుగా మనకు ఓ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం..? సమస్య పరిష్కార మార్గాలను ఆలోచిస్తాం..! తర్వాత ఆ మార్గాల్లో ముందుకు వెళ్తాం. ఇండియాకు కరోనా వైరస్ సమస్య వచ్చింది. అది దానంతటకు అతి అంతమయ్యే పరిస్థితి లేదు. మార్గం వ్యాక్సిన్ మాత్రమే. ప్రపంచంలో చాలా కంపెనీలతో పాటుగా.. ఇండియా కంపెనీలు కూడా… వ్యాక్సిన్ సిద్ధం చేశాయి. అలాంటప్పుడు ఏం చేయాలి… ఆ వ్యాక్సిన్‌ను దేశ ప్రజంలదరికీ పంపిణీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఇది కామన్‌సెన్స్ . కానీ కేంద్రం ఏం చేసింది… వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచలేకపోయింది. కంపెనీలకు కావాల్సిన ఆర్థిక సాయం చేసి..మౌలిక సదుపాయాలు పెంచి ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ మొత్తాన్ని హుటాహుటిన ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి భారత బయోటెక్ కంపెనీలకు ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే.. ఈ పాటికి ఇండియా ప్రపంచంలోనే సేఫ్ జోన్‌లోనే ఉండేది. కానీ ఇప్పుడు.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి పడిపోయింది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అంటే… కనీస ముందస్తు ఆలోచన కూడా పాలకుల్లో లేదు. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి ఇదే చెబుతున్నారు. దాహమేసినప్పుడు బావి తవ్వుకునే రీతిలో నిర్ణయాలను పాలకులు తీసుకుని… రాజకీయాలు.. ఇతర అంశాలకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇప్పుడు.. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఫలితంగా.. దేశ ఆర్థిక వ్యవస్థపైనా మరోసారి దెబ్బపడుతోంది.

ప్రజల్ని కాపాడే ఎన్నో అవకాశాలు వచ్చినా నిర్లక్ష్యం..!

ప్రస్తుతం రోజుకి సుమారు నాలుగు లక్షలకు పైగా కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఐదారు వేల మరణాలు నమోదవుతున్నాయి. నిజానికి ఈ కేసులు అధికారిక రికార్డులు మాత్రమే. రికార్డుల్లోకి ఎక్కని కేసులు.. మరణాలను అంచనా వేయడం కష్టం. చరిత్రలో ఎన్నో మహమ్మారులు వచ్చి ఉంటాయి కానీ శ్మశానాలు 24/7 పని చేసేలా చేసిన మహమ్మారి మాత్రం కరోనా. కానీ.. దీనికి నిందించాల్సింది కరోనాను కాదు. ఈ ప్రమాదం నుంచి సులువుగా ప్రజల్ని బయట పడేలా చాన్స్ వచ్చినా … పట్టించుకోకుండా ప్రజల్ని బలి చేయడానికే సిద్ధమైన పాలకులది. కరోనా సెకండ్ వేవ్ గురించి చాలా కాలంగా సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొదటి వేవ్‌లో జరిగిన నష్టం కళ్ల ముందే ఉంది. అలాంటి సమయంలో ఏ పాలకుడు అయినా అవసరమైన స్థాయిలో వాక్సిన్‌లు, రెమిడెసివిర్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌ను రెడీ చేసి ఉంచుకోవడం… ఆ రంగాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవడం.. కనీసం కామన్‌సెన్స్. అది లేకుండా పోయింది. మన దేశంలో వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం ఏడు ప్రభుత్వరంగ సంస్థలకు ఉంది. ప్రైవేటు సంస్థలలో కాకుండా… పూర్తి స్థాయిలో ఈ ఏడు వ్యాక్సిన్ తయారీ కేంద్రాల్లోనే ప్రయారిటీగా తీసుకుని వ్యాక్సిన్ తయారు చేస్తే దేశానికి సమస్య వచ్చేది కాదు. కానీ.. ఏప్రిల్‌ 16, 2021న కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ తయారీ కేంద్రాల్లో.. వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అప్పటికే కరోనా కమ్మసింది. ప్రజలు పిట్టల్లా రాలిపోవడం ప్రారంభించారు. వ్యాక్సిన్ ఫార్ములాను కంపెనీలు రూపొందించిన తర్వాత వెంటనే.. కేంద్రం ఈ పనిచేయాల్సింది. అంటే ఆరు నెలల కిందటే… కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు.

ఆక్సిజన్ మరణాల్లేవని కబుర్లు…కానీ జరుగుతోందేంటి..?

ఆక్సిజన్‌ అందుబాటులో లేక కొన్ని వందల మంది చనిపోయారు. ఈ విషయం నిజం అయితే పరువు పోతుందన్న ఉద్దేశంతో అటు కేంద్రం కానీ… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ.. అవన్నీ ఆక్సిజన్ లేక జరుగుతున్న మరణాలు కాదని… వాదించడానికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఆక్సిజన్ మరణాలు కానంతమాత్రాన మరణాలు కాకుండా పోతాయా..?. సమస్యను దాచి పెట్టుకున్నంత మాత్రాన ప్రాణాలు నిలబడతాయా..?. ఆక్సిజన్ కారణాలు కాకపోతే.. పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఎందుకు ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నారు..?. వాస్తవానికి మన దేశానికి రోజుకు 7,127 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్న 28 స్టీల్‌ ప్లాంట్లలో నుంచి రోజుకు 1500 టన్నుల ఆక్సిజన్‌‍ను ఉత్పత్తి చేయవచ్చు. మన దేశంలోని అతిపెద్ద ఆక్సిజన్‌ తయారి సంస్థ ఐనాక్స్‌ వివిధ ప్రాంతాలలో ఉన్న 44 యూనిట్ల ద్వారా రోజుకు 2000 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇదంతా మెడికల్ అవసరాల కోసం కాదు. పారిశ్రామిక అవసరాల కోసమే. ఇప్పుడు… దీన్ని మొత్తాన్ని మెడికల్ అవసరాల కోసం వినియోగించేలా చేసినా సరిపోవడ లేదు. పరిస్థితిని గుర్తించి..ఎక్కడికక్కడ మెడికల్ అవసరాల కోసం ఆక్సిజన్ సిద్ధం చేసుకోవాలని ఎంతో మంది నిపుణులు ప్రభుత్వాలకు సూచించారు. హాస్పిటల్‌‍లోనే రూ.కోటి ఖర్చుతో ఆక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుకోవచ్చు. దేశంలో ఉన్న ఓ మాదిరి ప్రైవేటు ఆస్పత్రులకే్ కాదు… ప్రభుత్వాలు నిర్వహించే భారీ ఆస్పత్రులకు రూ. కోటి పెద్ద ఖర్చు కాదు. కానీ ఏర్పాటు చేసుకోలేకపోయాయి. రూ.200ల కోట్ల ఖర్చుతో 162 హాస్పిటల్స్‌లో ఈ తరహా వ్యవస్థలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు కానీ.. అమలు చేయలేదు. ఫలితంగా ఆస్పత్రుల్లో మరణ మృదంగం కొనసాగుతోంది.

వ్యాక్సిన్ కోసం బడ్జెట్‌లో పెట్టిన రూ. 35వేల కోట్లేమయ్యాయి..?

ఈ కష్టకాలంలో రెమిడెసివర్ ప్రజల పాలిట సంజీవనిగా మారింది. అది సంజీవని కాదని ప్రభుత్వం ప్రకటనలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది కానీ.. డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచడానికి ముందుచూపుతో వ్యవహరించలేదు. ఫలితంగా ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కానీ ప్రజలకు మాత్రం అందడం లేదు.దేశంలో ఏడు కంపెనీలు రెమిడెసివిర్‌ మందును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. నెలకు 40 లక్షల ఇంజెక్షన్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. వాటిలో అత్యధికం ఎగుమతి అయ్యాయి. ఈ మందు పెద్ద ఎత్తున బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నారు. బ్లాక్‌లో కావాల్సినంత దొరుకుతోంది కానీ… బయట దొరకడం లేదు. కనీసం ఉన్న మందును… నేరుగా ప్రజలకు అందించలేని దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇప్పుడు రాజ్యమేలుతోంది. సెకండ్‌ వేవ్‌ విషయంలో నిపుణుల కమిటీ ఎన్నడో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కోసం రూ.35,000 కోట్లు ఖర్చు చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. గొప్పగా బడ్జెట్‌లో పెట్టింది. కానీ ఇప్పటికీ పెద్దగా ఖర్చు చేసింది లేదు. కానీ కరోనా అనంతర కాలంలో వడ్డించిన పన్నులు.. కేవలం పెట్రోల్, డీజీల్‌పైనే రూ.లక్ష కోట్లు ఎక్కువ. ఏటా..రూ. మూడు లక్షల కోట్ల రూపాయల పైన అదనపు ఆదాయాన్ని కేంద్రం పొందుతోంది. ఇంత ఆదాయం ఉన్నా… వ్యాక్సిన్ కోసం కనీస కఱ్చుేయడం లేదు. కరోనా వాక్సిన్లను ఇతర దేశాలకు వాణిజ్యపరంగా విక్రయించకుండా ఉండి ఉంటే రెండవ దశ ఇంత తీవ్రరూపం దాల్చివుండేది కాదు.

ఎన్నికలపై ఎంతో ముందు చూపు… నమ్మించడంలో లేని సాటి..!

ఎన్నికలపైన చూపిన ఆసక్తి, పట్టుదల దేశప్రజలకు కరోనా వాక్సిన్‌ అందించే విషయంలో మోడీ చూపించలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో కరోనా ప్రమాదకర స్థితికి వెళ్తున్నప్పుడు.. ఆయన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం… ఫ్రీ లేదు కొనుక్కోవాలని చెబుతున్నారు. ఫ్రీ ఇస్తాం అంటే.. చచ్చేదాకా క్యూలో నిల్చోవాలని అర్థం. అందుకే.., ఆయన చర్యలన్నింటినీ పరిశీలించిన ప్రజలు… రిజైన్ మోడీ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేశారు. ఓట్ల రాజకీయంలో.. భావోద్వేగాలను పండించి.. ఓట్ల సునామీని సృష్టించుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు… రాటుదేలిపోయారు. వారికి సాటి వచ్చే వారు ప్రపంచంలో లేరు. అయితే… ఆ భావోద్వేగానికి గురై ఓట్లు వేస్తున్న వారి గురించికనీస ఆలోచన చేయడం ధర్మం..న్యాయం. వారి ప్రాణాల గురించి కొంత ఖర్చు పెట్టడం..మంచి మనసు కాదు.., బాధ్యత. దురదృష్టవశాత్తూ.. అవే లోపించాయి. ఫలితంగా ఇప్పుడు దేశం … ప్రపంచం ముందు బేలగా నిలబడింది. చివరికి పాకిస్తాన్ సహా అందరూ జాలి చూపిస్తున్నారు. ఇండియా నుంచి ఎవరూ రావొద్దని ఆంక్షలు విధిస్తున్నారు.

దేశం ఉన్న దుర్భర పరిస్థితులు… ప్రజల ఆవేదన నుంచే రిజైన్ మోడీ హ్యాష్ ట్యాగ్ పుట్టింది. ఇది సోషల్ మీడియా ట్రెండింగ్ కాదు. ప్రజల్లో ఉన్న ట్రెండింగ్. ఇలా చెప్పినందుకు.. పాలకులకు కోపం రాచొచ్చు. అధికారం చేతిలో ఉందని.. ప్రశ్నించేవారందరి నోళ్లు మూయించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న పాలకులకు ఈ డిమాండ్ నచ్చకపోవచ్చు. అందుకే గొంతు నొక్కే ప్రయత్నం చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అలా చేయడం… తన నెత్తి మీద తాను చేయి పెట్టుకోవడమే అని పాలకులు గుర్తించకలేకపోతూండటమే ఇక్కడ అతి పెద్ద విషాదం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close