నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక కుట్ర ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

నా కొడుకుపై కేసుల్లో కుట్ర ఉంద‌ని, మాన‌సికంగా వేధించి… ఎన్ కౌంట‌ర్ చేస్తామ‌ని బెదిరించి నా కొడుకు రాహిల్ ను ఇరికిస్తున్నార‌ని ష‌కీల్ ఆరోపించారు. ఇల్లీగ‌ల్ గా అరెస్ట్ చేసి నా కొడుకు పేరు చెప్పిస్తున్నార‌న్నారు. ఓ కేసులో కోర్టు ద్వారా బెయిల్ రాగానే, మ‌రో కేసులో ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.

రాజ‌కీయాల్లో ఉండట‌మే మేము చేసిన త‌ప్పా… మా పిల్ల‌ల‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కిందిస్థాయి అధికారుల‌తో పాటు నా కొడుకుతో ఉన్న పిల్ల‌ల‌ను బెదిరించి, వారి త‌ల్లితండ్రుల‌ను బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు.

త‌ప్పు చేసి ఉంటే… కోర్టులో నిరూపించి ఉరితీయండి, నేను సంపూర్ణంగా స‌హ‌కరిస్తా. అంతేకానీ రాజ‌కీయ క‌క్ష‌ల్లో భాగంగా ఇదంతా చేయ‌టం మంచిది కాదంటూ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ వీడియో విడుద‌ల చేశారు. డీసీపీ విజ‌య్ కుమార్ ఎన్ కౌంట‌ర్ చేస్తామ‌ని బెదిరించ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

అయితే, దీనిపై హైద‌రాబాద్ సీపీ శ్రీ‌నివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ సాగుతోంద‌ని, పంజాగుట్ట హిట్ అండ్ ర‌న్ కేసులో మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కూడా నిందితుడిగా ఉన్నార‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close