‘ఫ్యామిలీ స్టార్’ చేతిలో రెంచ్ రాజు జాత‌కం

‘గీత గోవిందం’తో త‌న మార్క్ చూపించాడు ప‌ర‌శురామ్. ఆ సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. వంద కోట్ల సినిమా తీస్తే స‌హ‌జంగానే పెద్ద హీరోల దృష్టి ప‌డుతుంది. అలా.. మ‌హేష్‌బాబుతో సినిమా ఓకే చేయించుకొన్నాడు ప‌ర‌శురామ్. వారిద్ద‌రి కాంబోలో ‘స‌ర్కారు వారి పాట‌’ మొద‌లైంది. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మిక్డ్స్ ఫ‌లితాన్ని అందుకొంది. వ‌సూళ్లు ఓకే అనిపించుకొన్నా, ద‌ర్శ‌కుడిగా ప‌ర‌శురామ్ మార్క్ క‌నిపించ‌లేదు. దాంతో త‌దుప‌రి సినిమా ఆల‌స్య‌మైంది. మొత్తానికి `ఫ్యామిలీ స్టార్`ని ప‌ట్టాలెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఫ‌లితంపై త‌న త‌దుప‌రి సినిమా ఆధార‌ప‌డి వుంది.

‘ఫ్యామిలీ స్టార్‌’ స‌మ‌యంలోనే త‌మిళ హీరో కార్తికి ఓ క‌థ చెప్పాడు ప‌ర‌శురామ్. అదే ‘రెంచ్ రాజు’. ఈ క‌థ కార్తికి న‌చ్చింది కూడా. అయితే త‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల హోల్డ్‌లో ఉంచాడు. ఒక‌వేళ ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్ట‌యితే, కార్తి ఫోక‌స్ ప‌ర‌శురామ్ పై ప‌డుతుంది. దాంతో.. ఆ ప్రాజెక్ట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర కొన్ని ఆప్ష‌న్స్ ఉన్నాయి. దిల్ రాజు బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి అగ్రిమెంట్ కుదిరింద‌ని స‌మాచారం. అయితే.. అది కూడా ‘ఫ్యామిలీ స్టార్‌’ ఫ‌లితంపైనే ఆధార‌ప‌డి ఉంది. ఇంకొన్ని గంట‌ల్లో ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుంది. ప‌ర‌శురామ్ సినిమా కార్తీతోనా, మ‌రో హీరోతోనా అనేది పూర్తిగా ‘ఫ్యామిలీ స్టార్’ చేతుల్లోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close