మోడీ మంత్రివర్గం నుంచి ఐదుగురు అవుట్

ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడమే చాలా కష్టం అనుకొంటే ఏకంగా కేంద్రమంత్రి పదవి దక్కితే అది చాలా గొప్ప అదృష్టంగానే భావించవచ్చు. రెండున్నరేళ్ళ క్రితం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కూటమిలో సభ్యులుగా ఉన్న అన్ని పార్టీలకి ఒకటో రెండో కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే ప్రభుత్వం భాజపా నేతృత్వంలో ఏర్పడింది గాబట్టి ఎక్కువ పదవులు ఆ పార్టీ ఎంపిలకే దక్కాయి. ఈరోజు ఐదుగురు మంత్రులకి మోడీ ఉద్వాసన పలికారు. వారి పనితీరు సంతృప్తికరంగా లేదనే కారణంతోనే వారిని బయటకి పంపినట్లు తెలుస్తోంది. ఈ రోజు పదవులు కోల్పోయిన వారిలో నిహాల్‌ చంద్‌, రామశంకర్‌ కఠారియా, సన్వర్‌లాల్‌ జాట్‌, మనుసుఖ్‌భాయ్‌ వాస్వా, ఎం.కె.కుందారియాలు ఉన్నారు. విశేషమేమిటంటే ఆ ఐదుగురు కూడా భాజపాకి చెందినవారే కావడం. ఈరోజు కనీసం ముగ్గురు కేంద్ర మంత్రులకి క్యాబినెట్ హోదా కలిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ కేవలం ప్రకాష్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతి కల్పించడం మరో విశేషం.
కొత్తగా చేరిన 19మందిలో అసోం, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి చెరో ఇద్దరు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ల నుంచి చెరో ముగ్గురు, రాజస్థాన్ నుంచి నలుగురు ఉన్నారు. వచ్చే రెండేళ్ళలో ఎన్నికలు జరుగబోయే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకే కాకుండా ఎన్నికలు పూర్తయిన అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం హర్షణీయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close