ఫామ్-7లు పెట్టడం తప్పు కాదంటున్న జగన్..! మరి క్రిమినల్ కేసులెందుకు..?

ఎన్నికల కమిషన్‌ గుర్తించినవి కాకుండా తాము చెప్పినవే నకిలీ ఓట్లని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. తాము ఫిర్యాదు చేసిన ఓట్లను రెండు సార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం తొలగించలేదని, అందుకే ఫామ్-7లను దరఖాస్తు చేశామని చెప్పుకొచ్చారు. డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన జగన్ రాజ్ భవన్ ముందు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రెండేళ్లుగా ఓటరు జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని జగన్ ప్రకటించారు. టీడీపీకి ఓటు వేయరని భావించినవారి పేర్లు తొలగిస్తున్నారని.. గత ఎన్నికల్లో 5లక్షల ఓట్లతో ఓడిపోయాం..ఈసారి జాగ్రత్తగా ఓటర్ల జాబితా పరిశీలించామని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నట్టు గుర్తించామని చెప్పుకొచ్చారు. 56 లక్షల దొంగ ఓట్లపై కోర్టును ఆశ్రయించామన్నారు. చర్యలు తీసుకోకపోగా మరో 3లక్షల దొంగ ఓట్లు చేర్చారని విమర్శించారు.

ఆ ఓట్లను తొలగించడానికే ఫామ్-7లను పెట్టామన్నారు. దొంగ ఓట్లు తొలగించాలని ఫారమ్‌-7 దరఖాస్తు చేశామని, ఫామ్‌ -7 దరఖాస్తు అంటే ఓటు తొలగించడం కాదు, ఫామ్‌-7 అంటే విచారణ చేయాలని ఈసీని కోరడమని జగన్‌ కొత్త అర్థం చెప్పారు. విజ్ఞత ఉన్నవారందరూ ఫామ్‌-7 పై అవగాహన కల్పించాలని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల సంఘం వైసీపీ కార్యకర్తలపై 300కు పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఫామ్-7 పై ఎన్నికల సంఘానికే కొత్త అర్థం చెబుతున్నారు జగన్. ఎన్నికల సంఘం జాబితా కన్నా తన దగ్గరున్న ఓటర్ల జాబితానే కరెక్ట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఐటీ గ్రిడ్‌ సంస్థ దాడుల్లో ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయని.. జగన్ తెలుసుకున్నారు. ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు ప్రైవేట్‌ కంపెనీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కలర్‌ ఫొటోతో ఉన్న ఓటర్‌ వివరాలు యాప్‌లో ఎలా ఉంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు కూడా సేవామిత్రలో కనిపిస్తున్నాయని తాను చూసినట్లుచెప్పుకొచ్చారు. డేటా చోరీపై, చంద్రబాబుపై కేసులు నమోదు చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని జగన్ తెలిపారు. సైబర్‌ క్రైమ్‌కు పాల్పడిన చంద్రబాబు, లోకేష్‌ జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. సేవామిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత వివరాలున్నాయని చెప్పారు. వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థ దగ్గర ఉంటే ప్రజలకు భద్రత ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసు నమోదు చేయడంలో తప్పు లేదని, చోరీ ఎక్కడ జరిగితే అక్కడే కేసు నమోదు చేస్తారని జగన్‌ చెప్పుకొచ్చారు. ఏపీకి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చోరీ చేస్తే ఎక్కడ కేసు పెడతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్‌ సంస్థ ఉంది కాబట్టే కేసు నమోదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేయకూడని తప్పులు చేస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారుస్తున్నారున్నారు. కొసమెరుపేమిటంటే బీజేపీ నేతలు జగన్ కంటే అరగంట ముందు గవర్నర్ ని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close