ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చి భారత్ పై దండెత్తడానికి పంపుతోంది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ పాలకులకు ఇష్టం ఉందా లేదా అన్న అంశంతో వారికి సంబంధం లేదు. భారత్ తో ఏదో విధంగా ఉద్రిక్తతలు కొనసాగాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అందుకే కుట్రలు చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ ఆర్మీని కూడా ప్రభుత్వంలాగే భావించి మన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. అందు కోసం ఒక్క పని చేస్తే చాలు..బలూచ్ వేర్పాటు వాదులకు మద్దతు సీక్రెట్‌గా ఇచ్చినా చాలు పాకిస్తాన్ సైన్యం గుక్కతిప్పుకోకుండాఉంటుంది.
భారత్ పై దాడి చేసే ఉగ్రవాదులు – పాక్ సైనికులే !
భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా .. అధికారికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. పాక్, భారత్ కాల్పులు ఆపివేశాయి. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. చీకటి పడిన తర్వాత బుసలు కొట్టే పాములా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. అవి ఆగకపోతే భారత్ వైపు నుంచి మిస్సైల్స్ పడతాయి. ఆ కాల్పులు పాకిస్తాన్ సైన్యమే చేస్తోంది. కానీ పాకిస్తాన్ సైన్యం రక్షణలో.. ఇంకా చెప్పాలంటే వారి విభాగంగా మారిన ఉగ్రవాదులు చేసే దాడులు ఆగే అవకాశం లేదు. ఉగ్రవాద దాడులకు పాల్పడి.. తమకు సంబంధం లేదని వాదించడం పాకిస్తాన్ స్టైల్. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. బహిరంగంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతారు.. ఇటీవల భారత్ బాంబుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకూ హాజరయ్యారు.
ఇక భారత్ లక్ష్యం నేరుగా పీవోకే.. పరోక్షంగా బలూచిస్తాన్ !
నేరుగా చేసే యుద్ధాలతో అన్ని లక్ష్యాలను సాధించలేరు. అందుకే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ ను దెబ్బకొట్టడానికి పరోక్ష వ్యూహాలను కూడా అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాకిస్తాన్ తో జరిగే చర్చలు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం అనే అంశంపైనే జరుగుతాయని మోదీ ప్రకటించారు. ఆర్మీ జనరల్స్ స్థాయిలో జరిగే చర్చలు.. కేవలం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి మాత్రమే. అసలైన చర్చలు జరగాలంటే… పీవోకే అప్పగింతపైనే చర్చించారు. ఇది భారత్ నేరుగా చూసుకునే వ్యవహారం. బలూచిస్తాన్ విషయంలో భారత్ వ్యూహం ఏమిటో తెలియదు. అక్కడ వేర్పాటు ఉద్యమం జరుగుతోంది. అక్కడి ప్రజలకు భారత్ కు సానుకూలంగా ఉన్నారు. భారత్ మద్దతిస్తే చాలని తాము మరో బంగ్లాదేశ్ లాగా మారుతామని అంటున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది భారతే.
ఇప్పటికే బలూచిస్తాన్ విషయంలో పాక్ ఆరోపణలు
బలూచిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి భారత్ మద్దతిస్తుందో లేదో ఎవరికీ తెలియదు కానీ.. భారత్ పై మాత్రం పాకిస్తాన్ నిందలేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ సపోర్టు ఉందని ఆరోపిస్తూ ఉంటుంది.అయితే అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలు. నిజమేంటో తెలియదు. నిజంగా భారత్ మద్దతిస్తే మాత్రం.. బలూచిస్తాన్ ను కాపాడుకోవడం పాకిస్తాన్ కు అసాధ్యమవుతుంది. పాకిస్తాన్ ను బలహీనం చేయడానికి భారత్ కు ఈ బలూచిస్తాన్ కూడా ఓ బలమైన అవకాశం అనుకోవచ్చు. కానీ ఇది పరోక్షంగా చేయాల్సిన పని . చేసినా వివరాలు బయటకు రాకుండా చేయాల్సిన పని. బలూచిస్తాన్ ను విముక్తం చేయిస్తే పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే.