జీఎస్టీ ఎగ్గొట్టిన ఇళ‌య‌రాజా

ఈమ‌ధ్య వార్త‌ల్లో ఇళ‌య‌రాజా పేరు ఏదో ఓ రూపంలో గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఆమ‌ధ్య ప్ర‌ధాని మోడీ జ‌పం చేస్తూ వార్త‌ల్లోకి ఎక్కారు. ఆ త‌ర‌వాత‌.. రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేస్తున్నార‌ని చెప్పుకున్నారు. అంత‌కు ముందు కాపీ రైట్స్ యాక్ట్ పై.. ఆయ‌న కోర్టుకెళ్లారు. ఇలా.. త‌ర‌చూ ఇళ‌య‌రాజా పేరు క‌నిపిస్తోంది.. వినిపిస్తోంది. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు రూ.2 కోట్ల మేర జీఎస్టీ ఎగ్గొట్టినందుకు ఆయ‌న‌కు నోటీసులు అందాయి. వెంట‌నే జీఎస్టీ క‌ట్టాల‌ని, లేదంటే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న‌ది ఆ నోటీసుల సారాంశం. ఇది వ‌ర‌కు కూడా.. ఇలాంటి నోటీసులే ఇళ‌య‌రాజాకు అందాయి. అయితే.. వాటికి ఆయ‌న స్పందించ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి.. జీఎస్టీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కూడా ఇళ‌య‌రాజా నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోతే.. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. జీఎస్టీ అనేది కేంద్రానికి సంబ‌ధించిన అంశం. ప్ర‌ధాని దృష్టిలో ప‌డ‌డానికి.. ఇళ‌య‌రాజా వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న్ని పొగిడి…. రాజ్య‌స‌భ సీటో, లేదంటో ప‌ద్మ పుర‌స్కార‌మో అందుకోవాల‌ని ఇళ‌య‌రాజా ఆశ ప‌డ్డార‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడు ఇళ‌య‌రాజాని జీఎస్టీ విష‌యంలోనే వ‌ద‌ల‌డం లేదు. ఇక ప‌ద్మాలు, రాజ్య‌స‌భ‌లూ ఇస్తారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close