తెలంగాణ బీజేపీకి ఒక్కటే చాయిస్ – కవిత అరెస్ట్ !

తెలంగాణ బీజేపీ పరిస్థితి ఒక్క సారిగా ఇలా ఎందుకు అయిపోయిందనేది చాలా మంది అంతుబట్టని విషయం. దీనికి కారణం బీజేపీ ఆయుధాలుగా చెప్పుకునే త్రివిధ దళాలు ఒక్క సారిగా సైలెంటా కావడమే. బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా అడుగు పెట్టాలనుకుంటే త్రివిధ దళాలుగా పేరున్న ఐటీ, ఈడీ, సీబీఐలను రంగంలోకి దింపుతుంది. బెంగాల్లో ఏం జరిగిందో ఇంకా అందరి కళ్ల ముందే ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా అందులో సగం దాడులు చేసినా… బీఆర్ఎస్ లో సగం మంది నేతలు బీజేపీలో చేరిపోయేవారు. అలాంటిదేమీ జరగలేదు.

కానీ బీజేపీ నేతల ప్రకటనలు మాత్రం కోటలు దాటిపోయాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి కేసీఆర్ కుటుంబాలు జైలు.. అదిగో ఇదిగో అంటూ బండి సంజయ్ చేసిన హడావుడికి లెక్కే లేదు. అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం కేంద్రంగా తెలంగాణ బీజేపీ కాదు. ఢిల్లీ బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కవితకు లిక్కర్ క్వీన్ అని హ్యాష్ ట్యాగ్ లు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇక అరెస్టే మిగిలిందని చెప్పారు. కానీ చివరికి ఏమీ చేయలేదు. అంతా సైలెంట్ అయిపోయారు.

అయితే అదే బీజేపీకి మైనస్ మారింది. ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా చల్లారిపోయింది. తెలంగాణ బీజేపీ నేతల ఆశలు అడియాశలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ప్రజల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క కారణం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అభిప్రాయానికి రావడం. నిజంగా బీజేపీ ఎదగాలనుకుంటే.. కవితను అరెస్ట్ చేసి ఉండేవారని అంటున్నారు. కేసీఆర్ బీజేపీని ఘోరంగా టార్గెట్ చేశారు. తన వద్ద ఉన్న పోలీస్ పవర్ తో ఏకంగా బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కూడా. ఇంత చేసినా బీఆర్ఎస్ తో బీజేపీ రాజీ పడిందేనే వ్యతిరేకత పెరిగిపోయింది. చివరికి అది కాంగ్రెస్ గెలవకూడదు..కేసీఆర్ గెలిచినా పర్వాలేదన్న హైకమాండ్ అభిప్రాయంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది.

ఇప్పుడు బీజేపీ నేతలకు ఏ దారి కనిపించడం లేదు. నడ్డా వచ్చి విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తెలంగాణ బీజేపీ ఇప్పటికిప్పుడు వ్యూహాన్ని మార్చుకుని.. బీఆర్ఎస్ పై దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడినా… ప్రజలు నమ్ముతారో లేదో అన్న పరస్థితి వచ్చింది . ఇదంతా స్వయంకృతమే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close