ఆర్కే పలుకు : వచ్చే ఏడాది నుంచి కేసీఆర్‌కు మ్యూజిక్ !

ఓ రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ఏం చేస్తుందో గత ఏడేళ్లుగా అనేక సార్లు కళ్ల ముందే కనిపించింది. అలాంటిది చేతికి అందే దశలో ఉన్నట్లుగా భావిస్తున్న తెలంగాణను వదిలి పెడతారా ? లేనే లేదు. మరేం చేస్తారు..? బీజేపీ స్టైల్ ఆఫ్ రాజకీయం ఉంటుంది. ముందుగా తమ టార్గెట్‌ను ఒంటరిని చేస్తారు. చుట్టూ ఉన్న వారిపై దండెత్తుతారు. లొసుగులు పట్టుకుని చివరికి ఆ టార్గెట్‌నూ ఓడిస్తారు. బెంగాల్ లాంటి చోట్ల విఫలమైంది కానీ.. తెలంగాణలో మాత్రం విఫలం కాదని బీజేపీ నేతలు గట్టిగా అనుకుంటున్నారట. వచ్చే ఏడాది నుంచే తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్ అమలు ప్రారంభం కాబోతోందని .. ఈ వారం కొత్తపలుకులో ఆర్కే విశ్లేషించారు.

బీజేపీ విషయంలో హైదరాబాద్‌లో భీకరమైన ప్రకటనలు చేసి.. ఢిల్లీలో మాత్రం మొహం కూడా చూపించకుండా వస్తున్న కేసీఆర్ విషయంలో ఈ వారం ఆర్కే చేసిన విశ్లేషణ ఇది. కేసీఆర్ అధికారం ఉందని.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంభావంతో కొన్ని నిబంధనలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారని.. వాటికి ఆయన స్వయంగా సంతకాలు చేశారని ఇప్పుడు అవి కేంద్రం చేతుల్లో ఉన్నాయని ఆర్కే చెబుతున్నారు. చాలా కాలంగా తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్న వారి వ్యవహారాలను గుప్పిట పట్టి ఉంచారు. అనేక సందర్భాల్లో చేసిన సోదాల లక్ష్యం అదేనని అంతర్లీనంగా చెప్పారు. మొత్తంగా చూస్తే బీజేపీ అన్నీ రెడీగా పెట్టుకుంది.. ఇక వచ్చే ఏడాది దాడులు చేయడం… రాజకీయం ప్రారంభించడమే మిగిలిందని అంటున్నారు.

ఈ విషయం తెలిసే బీజేపీపై కేసీఆర్ వార్ ప్రకటించారని కానీ అది ఏ మాత్రం సరిపోవడంలేదని.. ఆయనకు ధైర్యం చాలడం లేదంటున్నారు. ఎలా చూసినా ఆర్కే విశ్లేషణ ప్రకారం.. కేసీఆర్‌కు వచ్చే ఏడాది చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది. ఏడేళ్ల పాలనా కాలంలో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రైతుల సమస్యలు… రాజకీయ నిర్ణయాలు కూడా ఆయనపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయింది. అన్నీ బాగున్నప్పుడు సరే.. లేకపోతే మొత్తం వచ్చి ఒక్క సారే మీదపడిపోతాయి. అలాంటి పరిస్థితి కేసీఆర్‌కు రాబోతోందనేది ఆర్కే అంచనా.

కనీసం కేసీఆర్ బీజేపీ వైపు నుంచి ప్రమాదం వస్తోందని రాజకీయంగా యుద్ధమే అని ప్రకటించారు కానీ ఆయన ఆప్తమిత్రుడు జగన్ మాత్రం.. రాష్ట్ర ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టేసి సే‌ఫ్ గేమ్ ఆడుతున్నారని ఆర్కే తేల్చేశారు. జగ‌న్ పాలన గురించి ప్రతీవారం చెప్పుకోవడానికి ఏముందని ఈ సారి తక్కువ స్థాయిలోనే రాశారు. అయితే జగన్‌కు చెందిన సాక్షి మీడియాతో పాటు ఆయనకు మద్దతిచ్చే మీడియా మొత్తాన్ని నీలి గ్రూప్‌గా ప్రచారం చేసేందుకు తనకు దొరికిన ఓ అవకాశాన్ని మాత్రం పక్కాగా వాడుకున్నారు. తన స్నేహితుడు అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఇంట్లో సీఐడీ సోదాల సమయంలో ఆయన అక్కడకు వెళ్లారు. వెంటనే కొన్ని మీడియాలు సీఐడీని అడ్డుకున్న రాధాకృష్ణ అని రాశారు. దీన్నే రాధాకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నించారు. ఆ మీడియా ఎలాంటి తప్పుడు రాతలు రాస్తుందో వివరించారు. నిన్న అంతా తన చానల్‌లో వీడియోలతో సహా చూపించినా.. మళ్లీ తాను కూడా చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close