తెలంగాణ ముందస్తుకు ఈసీ అడ్డు పుల్ల వేసిందా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. దానికి సంబంధించి రాజకీయ, పాలనా పరమైన జాగ్రత్తలు ఆరు నెలల ముందు నుంచే తీసుకుంటున్నారు. తీరా సమయం వచ్చే సరికి… ఆయనకు ఢిల్లీ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పటికిప్పుడు.. అసెంబ్లీని రద్దు చేసినా… ఏడాది చివరిలో జరగనున్న… నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న సమాచారం.. ఈసీ నుంచి… తెలంగాణ ప్రభుత్వానికి అందినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణం ఈసీ… పార్లమెంట్‌కు కానీ.. అసెంబ్లీలకు కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే..ఏడాది ముందుగా కసరత్తు ప్రారంభిస్తుంది. ఓటర్ల జాబితా నుంచి… ఈవీఎంల వరకూ..అన్నింటినీ ప్రణాళిక ప్రకారం.. సిద్ధం చేసుకుంటుంది.

షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరగాల్సి ఉంటుంది. అంటే జమిలి ఎన్నికలు. అందుకే ఈసీ.. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికే… ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ కేసీఆర్.. ఆరు నెలల ముందుగా.. ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈసీ నుంచి నిరాశజనక సమాధానం రావడంతో.. ఆయన అత్యున్న స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి కారణం కూడా.. ముందస్తు విషయంలో సహకారం కోసమేనన్న ప్రచారం ఉండనే ఉంది. కానీ కేంద్రంతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నా… ఈసీ మాత్రం… తేడాగా స్పందించడంతో… కేసీఆర్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క అంశంపైనా… ప్రధాని మోడీ.. సానుకూల నిర్ణయాలు తీసుకోవడం లేదు. కనీసం ముందస్తుకు అయినా సహకరిస్తారేమో అని చూస్తే.. ఈసీకి ఎలాంటి సూచనలు చేయడం లేదు. రాజీవ్ శర్మతో పాటు కేటీఆర్‌ను కూడా పంపి… లాబీయింగ్ చేసినా.. ఫలితం కనిపించకపోవడంతో.. తానే స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ప్రధానిని కూడా.. కలసి.. ముందస్తుకు మార్గం సుగమం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఈసీ చేతుల్లో అంటే.. కేంద్రం చేతుల్లోనే ఉందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close