`కిస్ స్ట్రీట్’ లో గలాట

పట్టపగలు, నడివీధిలో `ముద్దుల పోటీ’ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు దీన్ని `కిస్ స్ట్రీట్ పోటీ’ అని ముద్దుగా పేరుపెట్టారు. ఇంకేముందీ, స్వేచ్ఛా ప్రియులు హ్యాపీ న్యూఇయర్ రోజున పొద్దున్నే నిర్వాహకులు చెప్పిన స్ట్రీట్ లోకి వచ్చేసి దాన్ని ఉన్నట్టుండి `కిస్ స్ట్రీట్’ గా మార్చేశారు. కానీ, అంతలోనే… కట్..కట్…

ఇలా అసహ్యంగా వీధిలో ముద్దులేమిటని `హనుమాన్ సేన’ సంస్థ మండిపడింది. ఈ ముద్దూమురిపాలను సహించేదేలేదంటూ ఈ సంస్థ కార్యకర్తలు అడ్డుతగిలారు. ఇంకేముందీ స్ట్రీట్ ఫైట్ మొదలైంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.

ఇదంతా కేరళలోని కోజికోడ్ లోని పబ్లిక్ లైబ్రరీకి సమీపంలోని ఒక వీధిలో జరిగింది. జనవరి 1 ఉదయం 9 గంటలకు Njattuvela అనే సాంస్కృతిక సంస్థ 2016 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఏదైనా ఓ స్పెషల్ షో పెట్టాలనుకుంది. అదీ,ఇదీ ఎందుకు ఏకంగా `వీధిలో ముద్దుల పోటీ’ పెడితే బాగుంటుందని తెగ ముచ్చటపడిపోయినట్లుంది. నూతన సంవత్సరం తొలిరోజు ఉదయం `ముద్దుల ప్రియులు’ బిరబిరా వచ్చేశారు. నిర్వాహకులు కూడా తెగ ఉత్సాహపడిపోయారు. ఇకనేం, `కానివ్వండం’టూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సరిగా అదే సమయంలో ఎక్కడినుంచో ఒక గుంపు ఊడిపడింది. స్వేచ్ఛాప్రియుల ముద్దుముచ్చట్లకు అడ్డుతగిలింది. క్షణంలో వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాల వారు దొమ్మీకి దిగారు. మధ్యలో కర్రలు కూడా ప్రత్యక్షమయ్యాయి. దగ్గర్లోనే ఉన్న పోలీసులకు ఈ వార్త అందింది. వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. 60 మంది పోలీసులు చుట్టుముడితేగానీ పరిస్థితి చక్కబడలేదు. ఆ తర్వాత, ఇంకేముందీ.. అరెస్టులు, కేసులు యథావిధిగా సాగిపోయాయి. అరెస్టయిన వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. పనిలోపనిగా ఒక మీడియాకు చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం మరో విశేషం.

ఈ సాంస్కృతిక సంస్థ స్వేచ్ఛాయుత కార్యక్రమాలను నిర్వహించడంలో దిట్ట. నైతిక పోలీసింగ్ పేరిట కొన్ని సంస్థలు చేపడుతున్న దాడులను ఈ సంస్థ తీవ్రంగా విమర్శిస్తుంటుంది. బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పు కాదని వాదిస్తుంది. అంతేకాదు, మంగళసూత్రాలను తగలబెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ హేతువాద సంస్థ గత ఏడాది మే నెలలో నిర్వహించింది. అప్పుడూ వారికి ఇలాంటి అడ్డంకే ఎదురైంది. అయినప్పటికీ ఎవరిదారి వారిదే. `లోకో భిన్న రుచి’ అని అందుకే అన్నారు కాబోలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close