కుప్పం టీడీపీ ముఖ్యనేతలందరిపై కేసులు – అసలు ప్లాన్ ఇదే!

చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అందులో మొదటి రోజు ఘర్షణ పడ్డారు.రెండో రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. కావాల్సినంత విధ్వంసం చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టారు. జరగాల్సింది జరిగింది. చంద్రబాబు కుప్పం దాటగానే.. టీడీపీ నేతలందర్నీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు. కుప్పం ముఖ్య నేతలందరిపైనా కేసులు పెట్టేసి.. ఐదారు ప్రత్యేక బృందాలను పెట్టి అరెస్ట్ చేయడం ప్రారంభించారు. అదే నేరుగా దాడులు చేసిన వైసీపీ నేతలు ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వారిపైనాకేసులు లేవు.

టీడీపీ నేతలపై కేసులే టార్గెట్‌గా చంద్రబాబు పర్యటనలో ఘర్షణల వ్యూహం వైసీపీ అమలు చేసినట్లుగా భావిస్తున్నారు. అందర్నీ కేసుల్లో ఇరికించడం ద్వారా ఎన్నికల సమయంలో వారిని బైండోవర్ చేయడంతో పాటు..పార్టీలో తిరగకుండా చేయవచ్చని వైసీపీ వ్యూహం అంటున్నారు. నిజానికి టీడీపీ నేతలు దాడులు చేశారో లేదో.. అసలు అక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లుగా ముఖ్య నేతలందరిపైనా కేసులు పెట్టడం అనూహ్యంగా మారింది.

ఈ విషయాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో కానీ కుప్పం విషయంలో చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలకు.. దాడులు.. దౌర్జన్యలు.. కేసులతో చెక్ పెట్టి గెలవడానికి వైసీపీ చేయాల్సినదంతా చేస్తుంది. టీడీపీ నేతలు తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని ఆవేశపడుతున్నారు కానీ అలాంటి సీన్ కోసం వైసీపీ ఎదురు చూస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close