ఎగిరి గంతేసిన లాలూ కుటుంబం

బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయంతో నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 29 మంది సభ్యులతో కూడిన మంత్రిమండలిని ఆయన ఏర్పాటుచేసుకున్నారు. వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో `కూటమిలోని అందరికీ సమన్యాయ’మన్న ఫార్ములాతో నితీశ్ మంత్రిపదవులు కట్టబెట్టారు. లాలూప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబసభ్యులు (భార్య, ఏడుగురు కుమార్తెలు, అల్లుళ్లు) మిగతావారికంటే ఎక్కువ ఆనందపడ్డారు. కుమారులిద్దరికీ కీలకపదవులు లభించేలా పెద్దాయన రాజకీయం బాగానే పనిచేసింది.దటీజ్ లాలూ… ఆయన ఇద్దరు కుమారులు (తేజశ్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్) మంత్రివర్గంలో కీలక స్థానాలు దక్కించుకున్నారు. అంతేకాదు, లాలూ ఇద్దరి కుమారుల్లో ఒకరికి (తేజశ్వి) డిప్యూటీ సీఎంహోదా లభించింది. వీరిద్దరు ఆర్ జెడీ తరఫున తొలిసారిగా గెలిచారు. డిప్యూటీ సీఎం హోదా సాధారణంగా సీనియర్ కి అప్పగిస్తారు. అయితే మహాకూటమి ఈక్వేషన్స్ ఆధారంగా ఈ కుర్రాడికి డిప్యూటీ హోదా దక్కింది.

నితీశ్ సహా, జెడియు నుంచి 12మంది, ఆర్ జెడీ నుంచి 12మంది, కాంగ్రెస్ నుంచి నలుగురికి మంత్రి పదవులు లభించాయి. లాలూ కుమారుడు తేజశ్వి (26)కు డిప్యూటీ సీఎంహోదాతో పాటుగా రహదారుల నిర్మాణం, భవన నిర్మాణాలకు సంబంధించిన శాఖ అప్పగించారు. బిహార్ ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడంలో ఈ శాఖ చాలాకీలకమైనది. కాగా, లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ కి ఆరోగ్య శాఖ అప్పగించారు. గతంలో ఎలాంటి అనుభవం లేని కుర్రాళ్లకు కీలకశాఖలు ఇవ్వడంలో నితీశ్ సాహసమే చేశారనిపిస్తోంది. ఎన్నికల్లో లాలూ తన పార్టీని జెడియుతో పాటుగా మహాకూటమిని విజయవంతంగా నడిపించడంలో కీలకపాత్ర పోషించినందుకు లాలూకి బాగానే గిట్టుబాటైంది. దీంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఆర్ జెడీ కి చెందిన మరో నాయకుడు అబ్దుల్ బారి సిద్ధిఖ్ ఆర్థికశాఖ అందుకున్నారు. హోమ్, సమాచార,ప్రచార శాఖ, సాధారణ పరిపాలన వంటి విధులు ముఖ్యమంత్రి స్వయంగా చూసుకుంటారు.

లాలూ ప్రసాద్ లాగానే, మరో పక్క రాహుల్ గాంధీ కూడా సంబరపడ్డారు. ప్రమాణస్వీకారోత్సవం చివర్లో ఆయన హాజరయ్యారు. ఢిల్లీ నుంచి రావడంలో జాప్యం జరిగింది.మహాకూటమిలో చేరడం వల్ల కాంగ్రెస్ కూడా బాగానే లబ్దిపొందింది. కాంగ్రెస్ లీడర్ అశోక్ చౌదరికి విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. నితీశ్ ప్రమాణస్వీకారం చేశాక , తేజశ్వీ ప్రమాణం చేశారు. రాజకీయాల్లో అతిరథమహారధులైనవారెందరో ఈ ప్రమాణోత్సవానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి బదులుగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయన లూలూ పక్కన కూర్చుని అప్పుడప్పుడు మాటలు పంచుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ నీ, ఆయన కుమారుడు- యూపీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్ కి ఆహ్వానాలు అందినప్పటికీ, ఈ ఉత్సవానికి సమాజ్ వాదీ ఎం.పీ తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హాజరయ్యారు. ఈయన లాలూ ప్రసాద్ యాదవ్ కి అల్లుడు. లాలూ తన కూతుర్లు, అల్లుళ్లతో వివిఐపీ సీట్లలో కూర్చుని తేజశ్వీ, తేజ్ ప్రతాప్ ప్రమాణస్వీకార కార్యక్రమాలను అమితానందంతో తిలకించారు.

మంత్రిపదవులు కట్టబెట్టడంలో నితీశ్ ఓ చక్కటి ఫార్ములాను అనుసరించారు. ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒకరికి పదవి వచ్చేలా ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహాకూటమి ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. బిహార్ ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంతో రాష్ట్రాన్ని మరింతగా నితీశ్ అండ్ హిజ్ టీమ్ కృషిచేస్తుందని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close